బజూకా బ్యూటీ ఐశ్వర్యా మేనన్‌

ఇటీవల ‘స్పై’తో అలరించిన ఈ బ్యూటీ.. మళ్లీ తెరపై ఎంట్రీ ఎప్పుడిస్తుందా అని ఎదురు చూస్తున్న అభిమానులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది ఐశ్వర్యా మేనన్‌. 

ప్రస్తుతం ‘భజే వాయువేగం’తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఇందులో కార్తీకేయ హీరో. ప్రశాంత్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. 

మమ్ముట్టి హీరోగా వస్తున్న ‘బజూకా’లోనూ ఐశ్వర్య నటిస్తోంది. ఈ చిత్రంలో మరో ఇద్దరు నాయికలున్నారు. వారే.. గాయత్రి అయ్యర్‌, దివ్య పిళ్లై. 

ఈ బ్యూటీది కేరళ అయినా పుట్టి పెరిగింది తమిళనాడులో. చదువంతా అక్కడే సాగింది. ఇంజినీరింగ్‌ పూర్తి చేసింది.

ఐశ్వర్య చదువు పూర్తయ్యాక కొన్నాళ్ల పాటు ఐటీ కంపెనీలో పని చేసింది. కానీ అది తనకి సంతృప్తినివ్వలేదట. అందుకే నటనపై ఆసక్తితో సినిమాల వైపు అడుగులు వేసింది.

‘కాదలిల్‌ సొదప్పువడదు ఎప్పడి’ అనే తమిళ చిత్రంతో 2012లో పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈమె కన్నడ, మలయాళంలోనూ మెరిసింది. ‘స్పై’తోనే టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. 

‘నమో భూతాత్మ’, ‘మాన్‌సూన్‌ మ్యాంగోస్‌’, ‘వీరా’, ‘నాన్ సిరితల్’, ‘ఆపిల్‌ పన్నె’ వంటి పలు చిత్రాల్లో నటించింది. సినిమాలే కాకుండా ‘తమిళ్‌ రాకర్స్‌’ వెబ్‌సిరీస్‌లోనూ నటించింది.

సోషల్‌మీడియాలో సింపుల్‌గా చీరకట్టు, లంగావోణీల ఫొటోలతో కనిపిస్తుంటుంది. అప్పుడప్పుడూ కాస్త గ్లామర్‌నూ ఒలకబోస్తూ ఆకట్టుకుంటోంది.

This browser does not support the video element.

ఐశ్వర్య ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌. ఎక్కువ సమయం జిమ్‌లోనే వర్కవుట్లు చేస్తూ ఉంటుంది. అలాగని ఆహారం విషయంలో ఎటువంటి నిబంధనలు పెట్టుకోదు. ఐస్‌క్రీమ్‌ అంటే మరీ ఇష్టమట.

చీరకట్టు అంటే ఆమెకి మహా ఇష్టం. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో శారీతోనే సందడి చేస్తుంటుంది. ఆమె చీరకట్టుకు బోలెడు ఫ్యాన్స్‌ ఉన్నారు.

వాహ్వా.. వహీదా..!

గిటార్‌ ఇష్టం... బన్నీ ఇంకా ఇష్టం

ఈవారం ఓటీటీ సినిమాలు/సిరీస్‌లు

Eenadu.net Home