బుల్లి తెరను షేక్‌ చేస్తున్న రీతూ..

రీతూ చౌదరి.. ఈ పేరు వినే ఉంటారుగా..! జబర్దస్త్‌లో హైపర్‌ ఆది టీమ్‌లో అలరిస్తూ ప్రేక్షకుల్నిక్యూట్‌గా కట్టిపడేస్తుంది. రీతూకి సోషల్‌మీడియాలో ఫాలోయింగ్‌ ఎక్కువే. తన గురించి కొన్ని విషయాలు..

(photos: instagram)

This browser does not support the video element.

రీతూ హైదరాబాద్‌లో పుట్టింది. టిక్‌టాక్‌ వీడియోలతో ప్రారంభమై.. యాంకర్‌గా కెరియర్‌ని మొదలుపెట్టి.. ఇప్పుడు యూట్యూబ్‌లోనూ షార్ట్‌ వీడియోలతో అలరిస్తోంది. 

యాంకర్‌ ప్రదీప్‌ మాచిరాజు ‘పెళ్లి చూపులు’ రియాలిటీ షోతో రీతూ పాపులరైంది. తర్వాత సీరియల్స్‌లో ఛాన్స్‌లు వచ్చాయి.

‘మౌనమే ఇష్టం’ సినిమాతో వెండితెరపై మెరిసింది. ‘గోరింటాకు’, ‘సూర్యవంశం’, ‘ఇంటిగుట్టు’ తదితర సీరియల్స్‌లో విలన్‌ పాత్రల్లో మెప్పించింది. 

సినిమాలు, సీరియల్స్‌ కంటే జబర్దస్త్‌తోనే రీతూకి ఎక్కువ గుర్తింపు వచ్చిందని చెప్పొచ్చు. 

షూటింగ్‌ బ్రేక్‌లో రీల్స్‌ చేస్తూ సోషల్‌మీడియాలో షేర్‌ చేస్తుంది. రీతూకు ఇన్‌స్టాలో ఫాలోయింగ్‌ ఎక్కువగానే ఉంది. 

యూట్యూబ్‌లో హోమ్‌ టూర్‌లు, ఫ్యాషన్‌, బ్యూటీపై వ్లాగ్‌లు చేస్తుంటుంది. రీతూకి యూట్యూబ్‌లో నాలుగు లక్షలకు చేరువలో సబ్‌స్ర్కయిబర్లు ఉన్నారు. 

‘‘విజయ్‌ దేవరకొండకి వీరాభిమానిని. కనీసం ఒక్కసారైనా తనతో కలసి ఫ్రేమ్‌లో కనిపించాలని ఉంది’’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. 

షూటింగ్‌ నుంచి విరామం దొరికితే వెంటనే విహారయాత్రకి ప్లాన్‌ చేస్తుంది. రీతూకి హార్స్‌ రైడింగ్‌ ఇష్టం అని చెబుతుంది.

This browser does not support the video element.

పండగలు, వీకెండ్‌లు తోటి ఆర్టిస్టులు, కుటుంబంతో గడిపేందుకు ఇష్టపడుతుంది. 

నెక్సా వేదికపై అందాల తారలు..

‘సరిపోదా శనివారం’లో తమిళ నటి

మోస్ట్‌ పాపులర్‌ హీరోయిన్స్‌

Eenadu.net Home