రష్మీ.. అనసూయ బాటలో కొత్త యాంకర్‌..

సీరియల్స్‌లో నటించి మెప్పించిన సౌమ్య రావు.. ప్రస్తుతం‘జబర్దస్త్‌’షోలో యాంకర్‌గా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది.

Image: Instagram/Sowmya Rao

‘జబర్దస్త్‌’ నుంచి అనసూయ తప్పుకోవడంతో షో నిర్వాహకులు.. ఆమె స్థానంలో సౌమ్య రావును తీసుకొచ్చారు.

Image: Instagram/Sowmya Rao

తక్కువ సమయంలోనే ‘జబర్దస్త్‌’ నటులు, జడ్జిలతో కలిసిపోయింది. ప్రేక్షకుల నుంచీ ఈమెకు మంచి మార్కులే పడ్డాయి. 

Image: Instagram/Sowmya Rao

ఇప్పుడు యాంకరింగ్‌లోనే కాదు.. సోషల్‌మీడియా పోస్టుల్లోనూ రష్మీ, అనసూయను ఏ మాత్రం తీసిపోనని నిరూపిస్తోంది సౌమ్య.

Image: Instagram/Sowmya Rao

రష్మీ, అనసూయ తరచూ ఫొటోషూట్స్‌లో పాల్గొంటూ ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకుంటుంటారు. 

Image: Instagram/Sowmya Rao

కొత్త యాంకర్‌ సౌమ్య రావు కూడా ఇన్‌స్టాలో తన ఫొటోషూట్‌ ఫొటోలను పోస్టు చేస్తోంది.

Image: Instagram/Sowmya Rao

యాంకర్‌గా మారకముందు నుంచే సౌమ్య ఇన్‌స్టాలో యాక్టివ్‌గా ఉంది. కానీ, ఎక్కువగా చీరకట్టుతో రీల్స్‌ చేసి పోస్టు చేసేది.

Image: Instagram/Sowmya Rao

ఈ మధ్య కాస్త గ్లామర్‌ డోస్‌ పెంచి.. హద్దులు దాటని ట్రెండీ లుక్స్‌తో నెటిజన్లను ఆకర్షిస్తోంది.

Image: Instagram/Sowmya Rao

కర్ణాటకకు చెందిన సౌమ్య.. మొదట అక్కడి టీవీ సీరియల్స్‌లో నటించింది. ‘శ్రీమంతుడు’ సీరియల్‌ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

Image: Instagram/Sowmya Rao 

This browser does not support the video element.

ఓసారి ఈటీవీ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలోనే ఈ భామకు ‘జబర్దస్త్‌’ యాంకర్‌గా అవకాశం వచ్చింది.

Image: Instagram/Sowmya Rao

రష్మీ, అనసూయ ‘జబర్దస్త్‌’ షో ద్వారానే పాపులారిటీ పెంచుకున్నారు. ఇప్పుడు సౌమ్య కూడా ఆ దారిలో వెళ్తోంది.

Image: Instagram/Sowmya Rao

బ్రిటీష్‌ చిత్రాల్లో ‘భారతీయ’ చరిత్ర

వ్యాపారవేత్తలుగా టాలీవుడ్‌ సినీతారలు!

దసరా బుల్లెమ్మ.. ఈ వెన్నెల!

Eenadu.net Home