మేడమ్‌.. సార్‌.. మేడమ్‌ అంతే!

జగతి మేడం బుల్లితెరపైనే కాదు.. వెండితెరపైనా సందడి చేస్తోంది. ‘శుక్ర’,‘ఏ మాస్టర్‌ పీస్‌’,‘మాటరాని మౌనమిది’తో అలరించి.. ఇప్పుడు ‘కిల్‌ ఆర్‌’లో రోబోగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

జ్యోతి పూర్వాజ్‌ అసలు పేరు కంటే టీవీ స్క్రీన్‌ పేరుతోనే పాపులర్‌. ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌ ఫేమ్‌ ‘జగతి మేడం’గా ఆమె క్రేజ్‌ సంపాదించుకుంది.

బెంగళూరులో పుట్టి, పెరిగిన జ్యోతి.. తొలి రోజుల్లో మోడలింగ్‌ చేసి, ఆ తర్వాత సీరియల్‌ నటిగా కెరీర్‌ను మొదలు పెట్టింది.

‘కన్యాదానం’ధారావాహికతో తెలుగు బుల్లితెరకు పరిచయమైంది.

జ్యోతి పూర్వాజ్‌ను వెండి తెరకు పరిచయం చేసింది ఆమె భర్త సుకు పూర్వాజ్‌.

జ్యోతి పూర్వాజ్‌ అసలు పేరు జ్యోతిరాయ్‌. ‘ఏ మాస్టర్‌ పీస్‌’చిత్రీకరణలో దర్శక నిర్మాత సుకు పూర్వాజ్‌ను కలసి ఇష్టపడి ప్రేమ వివాహం చేసుకుంది. 

కన్నడ ఇండస్ట్రీకి చెందిన జ్యోతి సీరియల్స్‌తో పాటూ ‘దియా’,‘99’ వంటి వెబ్‌ సిరీస్‌ల్లోనూ నటించింది.

నేను కన్నడ నటినే కావచ్చు.. సుకుతో పెళ్లి తర్వాత టాలీవుడ్‌ నా మెట్టినిల్లు అయిపోయింది అని చెప్పింది.

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే జ్యోతి.. తన గ్లామరస్‌ ఫొటోస్‌ షేర్‌ చేస్తుంటుంది. ఆమెకు 5.6 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కళాకారులకు ఆర్థిక సాయం చేస్తూ మంచి మనసునీ చాటుకుంటోంది.

‘మహిళలు నేర్చుకోవాల్సిన అతిముఖ్యమైన విషయం మనకి ఏవరూ అధికారం ఇవ్వరు.. దానిని మనమే తీసుకోవాలి’అని చెబుతోంది.

నలుపు.. అందాల మెరుపులు

ఫస్ట్‌ డే కలెక్షన్స్‌.. టాప్‌-10 చిత్రాలివే!

2024 మోస్ట్‌ పాపులర్‌ స్టార్స్‌

Eenadu.net Home