యశస్వి.. రికార్డులపై గురి 

భారత యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ (209) ఇంగ్లాండ్‌తో రెండో టెస్టులో డబుల్ సెంచరీ సాధించాడు. 

అతిపిన్న వయసులోనే (22 ఏళ్ల 36 రోజులు) ద్విశతకం చేసిన మూడో భారత బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు.

గత 20 ఏళ్లలో టెస్టు క్రికెట్‌లో యశస్వి కంటే తక్కువ వయసులో డబుల్‌ సెంచరీ చేసిన బ్యాటర్‌ ఒకరే ఉన్నారు. విండీస్ ఆటగాడు బ్రాత్‌వైట్ (21 ఏళ్ల 278 రోజులు) మాత్రమే.

ఒక బ్యాటర్ డబుల్‌ సెంచరీ సాధించినా జట్టు స్కోరు 400 కంటే తక్కువగా నమోదు కావడం ఇది నాలుగోసారి. ఈ మ్యాచ్‌లో భారత్‌ 396 పరుగులు చేసింది.

స్పిన్నర్ల బౌలింగ్‌లోనే యశస్వి 192 పరుగులు రాబట్టాడు. 2002 నుంచి ఇప్పటివరకు ఇలా ఆడిన రెండో బ్యాటర్ ఇతడే. అప్పుడు కరుణ్ నాయర్‌ (303) కూడా ఇంగ్లాండ్‌పైనే 192 రన్స్‌ చేశాడు. 

జట్టులోని మిగతా బ్యాటర్లు ఎవరూ 50 కూడా కొట్టకుండా... డబుల్‌ సెంచరీ సాధించిన ఆరో బ్యాటర్‌గా జైస్వాల్ నిలిచాడు.

23 ఏళ్ల వయసులోపే.. టెస్టుల్లో 150+ స్కోర్లు చేసిన మూడో బ్యాటర్‌ జైస్వాల్. అంతకుముందు సచిన్‌, వినోద్ కాంబ్లి ఉన్నారు.

ఇంగ్లాండ్‌పై రెండో టెస్టులో యశస్వి 7 సిక్స్‌లు బాదాడు. ఇలా ఆ జట్టుపై మరే ఇతర భారత బ్యాటర్‌ ఒక ఇన్నింగ్స్‌లో అన్ని సిక్సర్లు కొట్టలేదు. 

స్వదేశం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో తొలి రోజే అత్యధిక పరుగులు చేసిన రెండో భారత బ్యాటర్‌ యశస్వి జైస్వాల్‌ (179*). అంతకుముందు వసీమ్‌ జాఫర్ పాక్‌పై 192 పరుగులతో అజేయంగా నిలిచాడు. 

IPL వేలం: ఈ ఏడాది టాపర్‌ పంత్‌.. మరి గతంలో?

IPL: ఈసారి వీళ్లే టాక్‌ ఆఫ్‌ ది ఆక్షన్‌

IPL వేలం: 2022లో ₹ 551.7 కోట్లు... మరిప్పుడు ఎంత?

Eenadu.net Home