ప్రమోషన్స్‌లో వెరైటీ జాన్వీ

జాన్వీ కపూర్‌, రాజ్‌ కుమార్‌రావు నటించిన ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మాహి’ మే 31న విడుదల అయ్యింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జాన్వీ ధరించిన దుస్తులు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

తెలుపు రంగు లెహంగా, బ్లౌజుకి టెస్ట్‌ మ్యాచ్‌ రంగులతో కాలర్‌ని డిజైన్‌ చేశారు. లెహంగాపై అక్కడక్కడా ఎరుపు రంగుతో బంతులను పెయింట్‌ చేశారు.

పంజాబ్‌ స్టైల్‌లో ఉన్న పసుపు, గులాబీ రంగు కలయికతో డ్రెస్‌ని ధరించింది. దీని దుపట్టాపై మహిమా అని ఎంబ్రాయిడరీ చేశారు.

మోడ్రన్‌ లుక్‌లో ఎరుపు రంగు డ్రెస్‌లో మెరిసిపోతుంది. ఇందులో డ్రెస్‌ వెనక భాగంలో చిన్న చిన్న క్రికెట్ బంతులను డిజైన్‌ చేశారు.

రెడ్‌, బ్లూ కలర్‌తో ఉన్న చీరకు ట్రెండీగా స్లీవ్‌లెస్‌ బ్లౌజు ధరించింది. దానిపై మహి 6 అని వర్క్‌ చేశారు. బ్లౌజు మొత్తం క్రికెట్‌ బంతుల ఆకారంలో ఉన్న చిన్న చిన్న పూసలతో డిజైన్‌ చేశారు.

This browser does not support the video element.

రాజ్‌ కుమార్‌రావు, జాన్వీ ఫన్నీగా క్రికెట్ ఆడుతున్న ఓ వీడియోని ఇన్‌స్టాలో పోస్టు చేసింది. అందులో జాన్వీ ధరించిన స్లీవ్‌లెస్‌ బ్లౌజుపై తన జెర్సీ నెంబరు 6నే డిజైన్‌ చేయించుకుంది.

మెరూన్‌, వైట్‌ కలర్స్‌ కలయికతో ఉన్న జార్జెట్‌ చీరపై బాల్‌ డిజైన్‌ను ఎంబ్రాయిడరీ చేశారు.

ట్రెండీగా ఉన్న వైట్ కలర్‌ డ్రెస్‌పై బ్లూ కలర్‌ చమ్కీలతో బ్యాటర్‌ను, బాల్‌ను డిజైన్‌ చేశారు.  

This browser does not support the video element.

రాజ్‌కుమార్‌ రావు, జాన్వీ ప్రమోషన్‌లో భాగంగా సినిమాలోని ఓ పాటను రీక్రియేట్‌ చేశారు. అందులో జాన్వీ ధరించిన నీలి రంగు చీర పల్లుపై గ్రౌండ్‌, లైట్లు, బంతులు, ఆటగాళ్లను, వీక్షకులను ఎంబ్రాయిడరీ చేశారు. 

ఈ వారం ఓటీటీ సినిమాలు/సిరీస్‌లు

ఈ హీరోయిన్ల ‘టాటూ’ అర్థం తెలుసా?

స్ట్రాప్‌లెస్‌ ట్రెండ్‌ గురించి విన్నారా!

Eenadu.net Home