హ్యాపీ బర్త్‌డే.. తారక్ నాయిక
దివంగత నటి శ్రీదేవి - బోనీకపూర్ ముద్దుల తనయ జాన్వీ కపూర్ ఎట్టకేలకు టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనుంది.
Image: Instagram/Janhvi Kapoor
కొరటాల శివ దర్శకత్వం వహిస్తోన్న జూనియర్ ఎన్టీఆర్ 30వ చిత్రంలో జాన్వి నటిస్తోంది.
Image: Instagram/Janhvi Kapoor
నేడు ఈ అందాల తార పుట్టిన రోజు సందర్భంగా ‘ఎన్టీఆర్ 30’ చిత్ర బృందం ఈ విషయాన్ని ప్రకటించింది.
Image: Instagram/Janhvi Kapoor
జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి నటించేందుకు ఎంతో ఆతృతగా ఉన్నట్లు ఇన్‌స్టా వేదికగా వెల్లడించిందీ భామ.
Image: Instagram/Janhvi Kapoor
శ్రీదేవి కుమార్తె టాలీవుడ్‌లో నటించడం పట్ల ఎన్టీఆర్ అభిమానులే కాదు.. తెలుగు ప్రేక్షకులూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Image: Instagram/Janhvi Kapoor
‘ధడక్’తో బాలీవుడ్‌లో తెరంగేట్రం చేసిన జాన్వి.. అనతికాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.
Image: Instagram/Janhvi Kapoor
‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్’, ‘రూహీ’, ‘గుడ్ లక్ జెర్రీ’, ‘మిలి’ ఇలా మహిళా ప్రాధాన్యతా చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
Image: Instagram/Janhvi Kapoor
ప్రస్తుతం ‘బవాల్’, ‘మిస్టర్ అండ్ మిసెస్ మహీ’ చిత్ర షూటింగ్స్‌తో బిజీగా ఉన్న జాన్వి.. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించేందుకు సిద్ధమవుతోంది.
Image: Instagram/Janhvi Kapoor
విక్టరీ వెంకటేశ్, రానా కలిసి నటించిన ‘రానా నాయుడు’ కోసం ఓ ప్రమోషనల్ వీడియోలోనూ నటించింది. జాన్వి బర్త్‌డే సందర్భంగా ఆ వీడియోను నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసింది.
Image: Instagram/Janhvi Kapoor