జాన్వీ.. రొటీన్‌కి భిన్నంగా

This browser does not support the video element.

శ్రీదేవి వారసురాలిగా వెండితెరపైకి అడుగుపెట్టి తక్కువ కాలంలోనే స్టార్‌డమ్ సంపాదించుకుంది జాన్వీకపూర్‌.

Image:Instagram

 ఈ భామ రొటీన్‌ కథానాయిక పాత్రలకు భిన్నంగా నాయికా ప్రాధాన్యం ఉన్న సినిమాల్లోనే ఎక్కువగా నటిస్తోంది.

Image:Instagram

‘గుడ్ లక్‌ జెర్రీ’తో ఈ ఏడాది ఇప్పటికే ఓ హిట్‌ని ఖాతాలో వేసుకున్న జాన్వీ ఇప్పుడు సర్వైవల్‌ థ్రిల్లర్‌ ‘మిలీ’తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Image:Instagram

ముత్తుకుట్టి జేవియర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని బోనీ కపూర్‌ నిర్మిస్తున్నారు. నవంబరు 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌ ఆకట్టుకుంటోంది.

Image:Instagram

అనుకోని పరిస్థితుల్లో మైనస్‌ 18 డిగ్రీల గడ్డకట్టుకుపోయే చలిలో ఇరుక్కుపోయిన మిలీ అనే యువతి పాత్రలో కనిపించనుంది జాన్వీ. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీబిజీగా ఉంది.

Image:Instagram

‘ఇక్కడ ప్రతిభే కీలకం. అతిలోక సుందరి శ్రీదేవి కూతురనో, స్టార్‌ నిర్మాత బోనీ కపూర్‌ ముద్దుల తనయ కావడంతోనో ఎవరూ ఎర్ర తివాచీ పరచరు’ అని తన సినిమా అవకాశాల గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

Image:Instagram

‘ధడక్’తో నటిగా మారిన ఈ అందాల భామ.. తొలి చిత్రంతోనే మంచి మార్కులు కొట్టేసింది. అనంతరం ‘ఘోస్ట్‌ స్టోరీస్‌’, ‘గుంజన్‌ సక్సేనా: ది కార్గిల్‌ గర్ల్‌’, ‘రుహి’లతో అలరించింది.

Image:Instagram

నితేష్‌ తివారీ తెరకెక్కిస్తున్న ‘బవాల్‌’లో వరుణ్‌ ధావన్‌ సరసన నటించింది. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Image:Instagram

భారత మాజీ కెప్టెన్‌ ధోనీ జీవితం ఆధారంగా శరణ్ శర్మ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహీ’. ఇందులో జాన్వీ కపూర్‌, రాజ్‌కుమార్‌ రావు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Image:Instagram

అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వంలో అక్షయ్‌కుమార్‌, టైగర్‌ ష్రాఫ్‌ ప్రధాన పాత్రల్లో ‘బడే మియా ఛోటే మియా’ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో టైగర్‌ సరసన జాన్వీ నటించనుందని సమాచారం.

Image:Instagram

జాన్వీకి కాబోయే భర్త బోనీకపూర్‌ కంటే పొడుగ్గా ఉండాలట. అలాంటి అల్లుడే కావాలని తన తండ్రి అనుకుంటున్నారని జాన్వీ ఓ సందర్భంలో చెప్పింది.

Image:Instagram

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home