గోల్డెన్‌ బ్యూటీ.. జాన్వీ

అనంత్‌ అంబానీ - రాధిక మర్చంట్‌ వివాహ వేడుక కోసం జాన్వీ కపూర్‌ ప్రత్యేకంగా లెహంగాని డిజైన్‌ చేయించుకుంది. 

ఈ వేడుకలో జాన్వీ ధరించిన దుస్తులు ఇప్పుడు సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారాయి. 

బంగారు వర్ణంలో ఉన్న లెహంగాకు.. బంగారంతో డిజైన్‌ చేయించుకున్న స్లీవ్‌ లెస్‌ బ్లౌజు ప్రత్యేక ఆకర్షణ

బ్లౌజు ముందువైపు వివిధ నగల మోడళ్లను.. ఒకదాని తర్వాత ఒకటిగా అమర్చారు. 

కాసుల పేరు, చిలకలు, మామిడి పిందెలు, లక్ష్మీదేవి లాకెట్ లాంటి ఆభరణాల డిజైన్లతో బ్లౌజుని రూపొందించారు. దీని కోసం కొన్ని ప్రత్యేకమైన రాళ్లు, కెంపులు, రూబీలు ఉపయోగించారని సమాచారం. 

నడుముకు వడ్డాణాన్ని పోలి ఉన్న బెల్టుని రూపొందించారు. దీని డిజైనూ ప్రత్యేకంగానే ఉంది. 

లెహంగా, బ్లౌజుకి మ్యాచింగ్‌గా చౌకర్‌, పెద్ద జుంకీలు, పాపిట బిళ్ల ఇలా.. గోల్డెన్‌ బ్యూటీ అనిపించుకుంది జాన్వీ.

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home