షారుఖ్‌ని దాటిన జన్నత్.. ఎవరీమె!
జన్నత్ జుబైర్ రహ్మానీ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో మార్మోగుతున్న పేరు. ఈమె ఇన్‌స్టాగ్రామ్‌లో 4.97 కోట్ల ఫాలోవర్లతో బాలీవుడ్ అగ్ర హీరో షారుఖ్ ఖాన్‌ను (4.77కోట్లు) అధిగమించింది.
కత్రినా కైఫ్, జాన్వీ కపూర్, శ్రద్ధా కపూర్, మృణాల్ ఠాకూర్ వంటి బాలీవుడ్ అగ్రతారలు ఇన్‌స్టాలో జన్నత్‌ని ఫాలో అవుతున్నారు.
జన్నత్ 2001లో మహారాష్ట్రలో పుట్టింది. ముంబయిలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది.
ఏడేళ్ల వయసులో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటనలో అడుగుపెట్టింది. తర్వాత సినిమాల్లో అతిథి పాత్రల్లో కనిపించింది.
తండ్రి అహ్మద్ రహ్మానీ నటుడు. తను చిత్ర పరిశ్రమలోకి రావడానికి స్ఫూర్తి నాన్నే అని చెప్పింది.
‘ఆగ్: ద వార్నింగ్’, ‘లవ్ కా ది ఎండ్’, ‘వాట్ విల్ పీపుల్ సే’, ‘హిచ్కీ’, ‘కుల్చే చోలె’ వంటి హిందీ -పంజాబీ చిత్రాల్లో నటించింది.
25కి పైగా మ్యూజిక్ ఆల్బమ్స్‌లో ఆడిపాడింది జన్నత్. ఈమెకు సోషల్ మీడియాలో ఇంత గుర్తింపు రావడానికి అవే కారణం.
2008 నుంచి హిందీ సీరియళ్లు, గేమ్ షోలు, రియాలిటీ షోలతో టీవీ ప్రేక్షకులనూ అలరించింది. 2011లో ఉత్తమ బాల నటిగా ‘గోల్డ్ అవార్డ్స్’ నుంచి అవార్డు అందుకుంది.
2021లో ఫోర్బ్స్ 30 అండర్ 30లో ‘మీడియా మార్కెటింగ్’ జాబితాలో స్థానం దక్కించుకుంది.
ఫిట్‌నెస్ కోసం ఎక్కువగా శ్రమిస్తుంది. జిమ్‌లో వర్కౌట్లతో పాటు ఫన్ కూడా చేస్తుంది.
ఆహారం విషయంలో ఎన్ని నియమాలు పెట్టుకున్నా ఫ్రెంచ్ ఫ్రైస్‌కి మాత్రం వర్తించవు అంటోంది.
సల్మాన్ ఖాన్, షాహిద్ కపూర్, ఐశ్వర్యరాయ్‌కు వీరాభిమాని. డోరెమాన్, టామ్ అండ్ జెర్రీ, షిన్‌చాన్ వంటి కార్టూన్‌లు జన్నత్‌కి బాగా నచ్చుతాయి.