హ్యాపీ బర్త్‌డే రక్కమ్మ...

కిచ్చా సుదీప్‌ ‘విక్రాంత్‌ రోణా’లోని ‘రా రా రక్కమ్మ’ పాటలో స్టెప్పులేసి.. దేశవ్యాప్తంగా కుర్రకారును ఉర్రూతలూగించిన నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌. ఆగస్టు 11న ఈమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా తన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..

(photos:instagram/jacquelienefernandez)

బహ్రెయిన్‌లో పుట్టి పెరిగినా.. జాక్వెలిన్‌ సొంత దేశం శ్రీలంక. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో మాస్‌ కమ్యూనికేషన్‌లో డిగ్రీ చదువుకొని తిరిగి శ్రీలంకకే వచ్చేసింది. అక్కడి ఓ న్యూస్‌ ఛానల్‌లో యాంకర్‌గా కెరియర్‌ ప్రారంభించింది.

చిన్నతనం నుంచే నటి అవ్వాలని జాక్వెలిన్‌ కోరిక. దానికి మొదటి మెట్టుగా మోడలింగ్‌లో రాణించాలనుకుంది. దీంతో మోడలింగ్‌ చేస్తూ పలు అందాల పోటీల్లో పాల్గొంది.

అలా 2006లో శ్రీలంక తరఫున అందాల పోటీల్లో పాల్గొని మిస్‌యూనివర్స్‌గా గెలిచింది. ఆ తర్వాత కూడా మోడలింగ్‌, బ్రాండ్స్‌ ప్రచార చిత్రాల్లో నటిస్తూ శ్రీలంకలో పాపులరైంది.

మోడలింగ్‌ చేయడం కోసం 2009లో భారత్‌కు వచ్చిన జాక్వెలిన్‌ను చూసి దర్శకుడు సుజయ్‌ ఘోశ్‌ తను తెరకెక్కించిన ‘అలాద్దీన్‌’లో హీరోయిన్‌గా అవకాశమిచ్చాడు. ఆ చిత్రానికి గానూ ఈమెకు ఉత్తమ పరిచయ నాయికగా ఐఫా అవార్డు దక్కింది. 

ఆ తర్వాత వరుసపెట్టి ‘హౌజ్‌ఫుల్‌’ ‘మర్డర్‌ 2’, ‘రేస్‌ 2’, ‘కిక్‌’, ‘రాయ్‌’, ‘బ్రదర్స్‌’, ‘జుడ్వా 2’, ‘రామ్‌సేతు’, ‘సెల్ఫీ’ తదితర చిత్రాల్లో నటించి మెప్పించింది. 

పలు మ్యూజిక్‌ వీడియోల్లోనూ సందడి చేసింది. బాద్షాతో చేసిన ‘గెందా ఫూల్‌’ పాటకయితే ఇప్పటి వరకు 960 మిలియన్‌ వ్యూస్‌ వచ్చాయి. ప్రభాస్ నటించిన ‘సాహో’ చిత్రంలోని ‘బ్యాడ్‌ బాయ్‌’పాటలో ఆడిపాడింది జాక్వెలినే. 

తరచూ వివిధ దేశాల్లో జరిగే మ్యూజికల్‌ ఈవెంట్స్‌లో తన డ్యాన్స్‌తో అలరిస్తుంటుంది. ఈ బ్యూటీ.. బాలీవుడ్‌ దర్శకుడు సాజిద్‌ ఖాన్‌ కొన్నాళ్లు ప్రేమించుకొని విడిపోయారు.

జాక్వెలిన్‌ జంతు ప్రేమికురాలు. జంతువుల సంరక్షణ సంస్థ ‘పెటా’కు మద్దతిస్తోంది. అలాగే పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి సేవాకార్యక్రమాలు చేస్తుంటుంది.  

జాక్వెలిన్‌కి తన పరిసరాలు శుభ్రంగా లేకపోతే అస్సలు నచ్చదట. తన చుట్టూ ఉండే ప్రతిదీ పద్ధతిగా ఉండేలాగా చూస్తుందట. హిందీ, ఇంగ్లీష్‌, ఫ్రెంచ్‌, అరబిక్‌, స్పానిష్‌ భాషల్లో అనర్గళంగా మాట్లేడేస్తుంది.

డ్యాన్స్‌ రియాల్టీ షో ‘ఝలక్‌ దిఖ్లా జా(2016)’కు జడ్జిగా వ్యవహరించిన జాక్వెలిన్‌.. ప్రస్తుతం ‘ఫతా’, ‘క్రాక్‌- జీతేగా తో జియేగా’ చిత్రాలతో బిజీగా ఉంది.

ఈ భామకి ఇటలీ పర్యటన అంటే చాలా ఇష్టమట.. ప్రతిసారి హాలిడే ట్రిప్‌కి ఇటలీకే ప్లాన్‌ చేస్తుందట. ఈమె ఫేవరెట్‌ నటుడు షారుక్‌ఖాన్‌, లియోనార్డో డికాప్రియో.

సినిమాల్లోనే కాదు.. సోషల్‌మీడియాలోనూ ఈమెకు మంచి క్రేజ్‌ ఉంది. ఇన్‌స్టాలో ఈమెను 67.3 మిలియన్‌ నెటిజన్లు ఫాలో అవుతున్నారు.

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home