సినిమాల కోసం ఏమైనా చేస్తా..!

‘సిన్‌’ వెబ్‌ సిరీస్‌తో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన బ్రెజిల్‌ బ్యూటీ జెనిఫర్‌ పిచినటో. ‘జీబ్రా’తో వెండి తెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది.

సత్యదేవ్‌, ధనుంజయ హీరోలుగా, ప్రియా భవానీ శంకర్‌, జెనిఫర్ హీరోయిన్‌లుగా తెరకెక్కిన ఈ చిత్రం 22న విడుదల కానుంది.

బ్రెజిల్‌లో పుట్టిన ఈ సుందరి.. తొమ్మిదేళ్ల వయసు నుంచే మోడలింగ్‌ చేస్తోంది. 

న్యూయార్క్‌ లోని ‘ది బారో గ్రూప్ యాక్టింగ్ స్కూల్లో నటనలో శిక్షణ తీసుకుంది. అంతర్జాతీయంగా వాణిజ్య ప్రకటనలకు పోజులిస్తూ మురిపిస్తోంది. 

అక్షయ్‌ కుమార్‌ ‘రామ్‌సేతు’లో తన నటనతో మంచి మార్కులే సంపాదించుకుంది.

‘సినిమాల కోసం ఏమైనా చేస్తా’ అనే జెనిఫర్‌.. ‘రామ్‌సేతు’ కోసం పదికేజీల బరువు పెరిగింది. 

టాలీవుడ్ ఛాన్స్‌లకోసం తెలుగు భాష కూడా నేర్చుకుంది ఈ బ్రెజిల్‌ అందం.

మోడ్రన్ దుస్తుల్లో సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. జెనిఫర్‌కు ఇన్‌స్టాలో 2.76 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.  

‘రాత్రి పూట పారిస్‌ వీధుల్లో నడుస్తూ ఈఫిల్‌ టవర్‌ అందాన్ని ఆస్వాదించడం’ జెనిఫర్‌ హాబీ. 

భారత్‌లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న తొలి రోజుల్లో కొన్ని మ్యూజిక్‌ ఆల్బమ్స్‌లో ఆడిపాడింది.

పుట్టి పెరిగింది బ్రెజిల్ అయినా.. భారతీయ సంప్రదాయాలు నచ్చుతాయని చెప్పింది. ట్రెడిషనల్ దుస్తులు ధరించడం అన్నా ఇష్టమేనట..

నలుపు.. అందాల మెరుపులు

ఫస్ట్‌ డే కలెక్షన్స్‌.. టాప్‌-10 చిత్రాలివే!

2024 మోస్ట్‌ పాపులర్‌ స్టార్స్‌

Eenadu.net Home