ఐపీఎల్‌ 2023: జెర్సీ మారిన వేళ..!

దిల్లీ క్యాపిటల్స్‌ DC

డీసీ ఆటగాళ్ల జెర్సీ ముందుభాగంలో నీలిరంగు.. భుజాల నుంచి వెనుక భాగంలో ఎరుపు రంగు ఉంటుంది. 

Image: Twitter

మే 20న చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం డీసీ జెర్సీలో ఇంద్రధనస్సు రంగుల్ని జత చేశారు. భారత్‌లోని వైవిధ్యాన్ని తెలిపేందుకే ఈ మార్పు చేశారట.

Image: Twitter

లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ LSG

ఈ జట్టు జెర్సీ కూడా నీలిరంగులోనే ఉంటుంది. కానీ.. అక్కడక్కడ కాషాయం రంగు స్ట్రిప్స్‌ ఉంటాయి. 

Image: Twitter

మే 20న కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో మాత్రం లఖ్‌నవూ జట్టు.. మెరూన్‌, గ్రీన్‌ స్ట్రిప్స్‌ ఉన్న జెర్సీని ధరించింది. కోల్‌కతాకు చెందిన ఫుట్‌బాల్‌ జట్టు ‘మోహన్‌ బగన్‌ సూపర్‌ జెయింట్స్‌’కు మద్దతుగా ఈ జెర్సీ వేసుకున్నారు. ఈ రెండు జట్లకు యజమాని సంజీవ్‌ గోయెంకానే.

Image: Twitter

గుజరాత్‌ టైటన్స్‌ GT

సాధారణంగా గుజరాత్‌ టైటన్స్‌ ఆటగాళ్లు.. డార్క్‌ బ్లూ రంగులో ఉండే జెర్సీలే ధరిస్తుంటారు. 

Image: Twitter

మే 15న హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో జీటీ జట్టు లావెండర్‌ రంగు జెర్సీలు ధరించింది. క్యాన్సర్‌పై అవగాహన కల్పించడం కోసమే జెర్సీలో మార్పు చేసినట్లు జట్టు యాజమాన్యం పేర్కొంది.

Image: Twitter

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు RCB

బెంగళూరు ఆటగాళ్లది నేవీ బ్లూ, రెడ్‌ రంగులు కలగలిసిన జెర్సీ. గోల్డ్‌ రంగులో జట్టు లోగో ఉంటుంది. 

Image: Twitter

ఏప్రిల్‌ 23న రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ జట్టు నేవీ బ్లూ, గ్రీన్‌ రంగు జెర్సీ ధరించింది. ‘గో గ్రీన్‌’ క్యాంపెన్‌లో భాగంగా చెట్లు నాటడాన్ని, ఎకోఫ్రెండ్లీ అలవాట్లను ప్రోత్సహించడం కోసం ఈ జెర్సీని ఎంపిక చేసుకుంది.

Image: Twitter

ముంబయి ఇండియన్స్‌ MI

జట్టు పేరుకు తగ్గట్టే.. భారత్‌ను ప్రతిబింబించేలా నీలిరంగులోనే ముంబయి జట్టు జెర్సీ ఉంటుంది.

Image: Twitter

ఏప్రిల్‌ 16న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వారి జెర్సీ మారింది. ఆ రోజున మహిళల ప్రీమియర్‌ లీగ్‌లోని ముంబయి మహిళా జట్టు జెర్సీలను ధరించారు. క్రీడల్లో అమ్మాయిలను ప్రోత్సహించాలనే సందేశం ఇవ్వడానికే ఈ పని చేశారు.

Image: Twitter

IPL: ఈసారి వీళ్లే టాక్‌ ఆఫ్‌ ది ఆక్షన్‌

IPL వేలం: 2022లో ₹ 551.7 కోట్లు... మరిప్పుడు ఎంత?

IPL వేలం: గతేడాది స్టార్క్‌.. అంతకుముందు ఎవరంటే?

Eenadu.net Home