‘చక్దా ఎక్స్‌ప్రెస్’ రికార్డులు తెలుసా?
భారత మహిళల జట్టు సీనియర్ బౌలర్ జులన్ గోస్వామి తాజాగా క్రికెట్‌కు టాటా చెప్పింది. దాదాపు రెండు దశాబ్దాలపాటు సాగిన ఆమె కెరీర్‌లో ఎన్నో రికార్డులున్నాయి.
Image:Eenadu
పశ్చిమ బెంగాల్‌కి చెందిన జులన్ 2002లో భారత జాతీయ జట్టుకి ఎంపికై.. ఇంగ్లండ్‌పై తొలి మ్యాచ్ ఆడింది. తన చివరి మ్యాచ్ కూడా ఇంగ్లండ్‌పైనే కావడం విశేషం.
Image:Eenadu
వన్డేల్లో ఎక్కువ వికెట్లు (255) తీసిన రికార్డు జులన్ గోస్వామి పేరిటే ఉంది. ఈ ఫార్మాట్‌లో ఎక్కువ బంతులు (10,005) విసిరింది కూడా ఆమెనే.
Image:Eenadu
ఎక్కువ రోజులపాటు కెరీర్‌ని కొనసాగించిన రెండో క్రికెటర్‌గా నిలిచింది జులన్ (మొదటిస్థానం మిథాలీ రాజ్‌ది).
Image:Eenadu
ఒక మ్యాచ్‌లో (వన్డేల్లో) అత్యధిక వికెట్లు సాధించిన భారత బౌలర్ కూడా జులనే. 2011లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో (6/31) అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది.
Image:Eenadu
టెస్టు క్రికెట్‌లో ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు పడగొట్టిన తొలి భారతీయ మహిళా క్రికెటర్‌గానూ చరిత్రకెక్కింది జులన్. 2006లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఈ ఘనత సాధించింది.
Image:Eenadu
మూడు ఫార్మాట్లలో కలిపి మొత్తం 284 మ్యాచ్‌లు (12 టెస్టులు, 204 వన్డేలు, 68 టీ20లు) ఆడిన జులన్.. 355 వికెట్లు పడగొట్టింది.
Image:Eenadu
వన్డేల్లో ఎక్కువ క్యాచ్‌లు (69) అందుకున్న వారి జాబితాలో రెండో స్థానంలో ఉంది జులన్ గోస్వామి. సుజీ బేట్స్ (న్యూజిలాండ్) 79 క్యాచ్‌లతో ఫస్ట్ ప్లేస్‌లో ఉంది.
Image:Eenadu
ఆమె ప్రతిభకు గుర్తింపుగా 2007లో ‘ఐసీసీ విమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు లభించింది.
Image:Eenadu
క్రికెట్‌కు జులన్ అందించిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆమెపై ప్రత్యేక పోస్టల్ స్టాంప్ ముద్రించింది. 2010లో అర్జున, 2012లో పద్మశ్రీ అందుకుంది.
Image:Eenadu
తన క్యూట్ స్మైల్‌తో ఆకట్టుకునే జులన్‌ను జట్టు సభ్యులంతా ‘గోజీ’ అని పిలుస్తుంటారట! బబుల్, చక్దా ఎక్స్‌ప్రెస్.. వంటి ముద్దు పేర్లతోనూ ఆమె సుపరిచితమే!
Image:Eenadu
ప్రస్తుతం సుశాంతాదాస్ దర్శకత్వంలో ‘చక్దా ఎక్స్‌ప్రెస్’ పేరుతో జులన్ బయోపిక్ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో జులన్ పాత్రలో బాలీవుడ్ బ్యూటీ అనుష్కా శర్మ కనిపించనుంది.
Image:Eenadu