‘చక్దా ఎక్స్‌ప్రెస్‌’ రికార్డులు తెలుసా? 

భారత మహిళల జట్టు సీనియర్‌ బౌలర్‌ జులన్‌ గోస్వామి తాజాగా క్రికెట్‌కు టాటా చెప్పింది. దాదాపు రెండు దశాబ్దాలపాటు సాగిన ఆమె కెరీర్‌లో ఎన్నో రికార్డులున్నాయి.

Image:Eenadu

పశ్చిమ బెంగాల్‌కి చెందిన జులన్‌ 2002లో భారత జాతీయ జట్టుకి ఎంపికై.. ఇంగ్లండ్‌పై తొలి మ్యాచ్ ఆడింది. తన చివరి మ్యాచ్‌ కూడా ఇంగ్లండ్‌పైనే కావడం విశేషం.

Image:Eenadu

వన్డేల్లో ఎక్కువ వికెట్లు (255) తీసిన రికార్డు జులన్‌ గోస్వామి పేరిటే ఉంది. ఈ ఫార్మాట్‌లో ఎక్కువ బంతులు (10,005) విసిరింది కూడా ఆమెనే.

Image:Eenadu 

ఎక్కువ రోజులపాటు కెరీర్‌ని కొనసాగించిన రెండో క్రికెటర్‌గా నిలిచింది జులన్‌ (మొదటిస్థానం మిథాలీ రాజ్‌ది).

Image:Eenadu

ఒక మ్యాచ్‌లో (వన్డేల్లో) అత్యధిక వికెట్లు సాధించిన భారత బౌలర్‌ కూడా జులనే. 2011లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో (6/31) అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది.

Image:Eenadu

టెస్టు క్రికెట్‌లో ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు పడగొట్టిన తొలి భారతీయ మహిళా క్రికెటర్‌గానూ చరిత్రకెక్కింది జులన్. 2006లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో ఈ ఘనత సాధించింది.

Image:Eenadu 

మూడు ఫార్మాట్లలో కలిపి మొత్తం 284 మ్యాచ్‌లు (12 టెస్టులు, 204 వన్డేలు, 68 టీ20లు) ఆడిన జులన్‌.. 355 వికెట్లు పడగొట్టింది.

Image:Eenadu

వన్డేల్లో ఎక్కువ క్యాచ్‌లు (69) అందుకున్న వారి జాబితాలో రెండో స్థానంలో ఉంది జులన్‌ గోస్వామి. సుజీ బేట్స్ (న్యూజిలాండ్) 79 క్యాచ్‌లతో ఫస్ట్‌ ప్లేస్‌లో ఉంది.

Image:Eenadu 

ఆమె ప్రతిభకు గుర్తింపుగా 2007లో ‘ఐసీసీ విమెన్స్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు లభించింది.

Image:Eenadu

క్రికెట్‌కు జులన్‌ అందించిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆమెపై ప్రత్యేక పోస్టల్‌ స్టాంప్‌ ముద్రించింది. 2010లో అర్జున, 2012లో పద్మశ్రీ అందుకుంది.

Image:Eenadu

తన క్యూట్‌ స్మైల్‌తో ఆకట్టుకునే జులన్‌ను జట్టు సభ్యులంతా ‘గోజీ’ అని పిలుస్తుంటారట! బబుల్‌, చక్దా ఎక్స్‌ప్రెస్‌.. వంటి ముద్దు పేర్లతోనూ ఆమె సుపరిచితమే!

Image:Eenadu

ప్రస్తుతం సుశాంతాదాస్‌ దర్శకత్వంలో ‘చక్దా ఎక్స్‌ప్రెస్‌’ పేరుతో జులన్‌ బయోపిక్‌ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో జులన్‌ పాత్రలో బాలీవుడ్‌ బ్యూటీ అనుష్కా శర్మ కనిపించనుంది.

Image:Eenadu

ఫుట్‌బాల్‌.. మీకివి తెలుసా!

దేశవాళీ.. లిస్ట్‌-ఏ.. టాప్‌ 10 బ్యాటర్లు!

టీ20ల్లో హ్యాట్రిక్‌ వికెట్ విశేషాలు!

Eenadu.net Home