శ్రీరాముడి పయనం సాగిందిలా..!

మంగళప్రదము శ్రీరాముని పయనం.. ధర్మ ప్రమాణము రామాయణమూ అంటూ.. ‘ఆదిపురుష్‌’లో ఓ చక్కటి పాట ఉంది. అవును.. దేశంలో రాముడు నడయాడిన జాడలు కోకొల్లలుగా ఉన్నాయి.

పురాణాల ప్రకారం.. అయోధ్య నుంచి లంక వరకు సాగిన రాముడి ప్రయాణంలో పలు చోట్ల కీలక ఘటనలు చోటుచేసుకున్నాయి. వాటిలో కొన్ని...

అయోధ్య

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యను శ్రీరాముడి జన్మభూమిగా చెబుతారు. 14 ఏళ్ల వనవాసానికి సీతా, లక్ష్మణుడితో కలిసి ఇక్కడి నుంచే బయలుదేరారు. 

Image:Google Maps

ప్రయాగ్‌రాజ్‌

గంగానదిని దాటి వనవాసం ప్రారంభించే ముందు శ్రీరాముడు.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌(అలహాబాద్‌)లో ఉన్న భరద్వాజ మహర్షి ఆశ్రమానికి వెళ్లారు. మహర్షి ఆశీస్సులు తీసుకున్నారు.

Image:Google Maps

చిత్రకూట్‌

మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో రాముడు, సీతా, లక్ష్మణుడు కుటీరం ఏర్పాటు చేసుకొని కొన్నాళ్లు జీవించారు. దశరథ మహారాజు మరణవార్తను రాముడికి భరతుడు తెలియజేసింది ఇక్కడే. 

Image:Google Maps

దండకారణ్యం

భద్రాచలం సమీపంలోని శబరి నదిని దాటి..ప్రస్తుతం చత్తీస్‌ఘఢ్‌లోని బస్తర్‌ జిల్లాలో ఉన్న అరణ్యంలో రాక్షసులు, మృగాల మధ్య కొన్నాళ్లు సీతారాములు, లక్ష్మణుడు నివసించారు. 

Image:Google Maps

పంచవటి

మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న పంచవటి ప్రాంతంలోనే లక్ష్మణుడు సూర్పణకి ముక్కు కోయడం, రావణాసుడు సీతమ్మవారిని అపహరించే ఘట్టాలు చోటుచేసుకున్నాయి. 

Image:Google Maps

లేపాక్షి

సీతను అపహరించుకొని వెళ్తున్న రావణాసుడితో జటాయువు పోరాడింది.. ఆంధ్రప్రదేశ్‌లోని లేపాక్షి ప్రాంతంలోనే. ఇక్కడే రాముడికి సీతమ్మ అపహరణ గురించి జటాయువు వివరిస్తారు.

Image:Google Maps

హంపి

కర్ణాటకలో ఉన్న ఈ హంపిని ఒక్కప్పుడు కిష్కింద అనే పిలిచేవారట. ఇక్కడే రాముడు.. హనుమంతుడిని కలిశారు. వాలితో పోరాడి.. సుగ్రీవుడికి రాజ్యం దక్కేలా చేశారు.

Image:Google Maps

రామేశ్వరం

తమిళనాడులోని రామేశ్వరంలోనే రాముడు.. లంకపై యుద్ధానికి సిద్ధమయ్యారు. ఇక్కడే శివలింగాన్ని ప్రతిష్టించి పూజలు చేశారు. ఇక్కడి నుంచే వానరుల సాయంతో రామసేతును నిర్మించి లంకకు చేరుకున్నారు. 

Image:Google Maps

నూతన సంవత్సరం ఒక్కో చోట ఒక్కోలా..

అష్టదిగ్గజములు అంటే ఎంటో తెలుసా?

ఈ వారం రాశిఫలం

Eenadu.net Home