జులై 11.. వరల్డ్ పాపులేషన్ డే! మీకివి తెలుసా?
ప్రపంచంలో పెరుగుతోన్న జనాభా, దాని వల్ల వచ్చే సమస్యలపై అవగాహన కల్పించడం కోసం ఏటా జులై 11న వరల్డ్ పాపులేషన్ డే నిర్వహిస్తున్నారు.
image:pixabay
ఈ ఏడాది వరల్డ్ పాపులేషన్ డే థీమ్.. ‘మహిళలు.. అమ్మాయిలు ఏం కోరుకుంటున్నారనేదే ముఖ్యం’. మహిళలకు ప్రాధాన్యమివ్వాలని తెలియజేయడమే లక్ష్యంగా ఈ థీమ్‌ను తీసుకున్నారు.
image:pixabay
ప్రపంచవ్యాప్తంగా ఏటా 8.3 కోట్ల జనాభా పెరుగుతూనే ఉందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. జనాభా ఇలాగే పెరుగుతూ పోతే కరవు కాటకాలు కూడా తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
image:pixabay
గతేడాది నవంబర్‌లో ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరింది. 2050 నాటికి అది 970 కోట్లకు, 2080 నాటికి వెయ్యి కోట్లు దాటుతుందని ఐక్యరాజ్య సమితి అంచనా.
image:pixabay
ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశాలు చైనా(1.4 బిలియన్), భారత్ (1.4 బిలియన్). ప్రపంచ జనాభాలో ఈ రెండు దేశాలే 18 శాతం చొప్పున జనాభాను కలిగి ఉన్నాయి.
image:pixabay
ప్రపంచంలోనే అతి తక్కువ జనాభా ఉన్న దేశం ఏదో తెలుసా..? వాటికన్ సిటీ. ఇక్కడ జనాభా కేవలం.. 800.
image:pixabay
చైనా, భారత్‌లో జనాభా పెరుగుతుంటే.. ప్రపంచంలోని 61 దేశాల్లో 2050 నాటికి 1 - 10 శాతం వరకు జనాభా తగ్గిపోవచ్చని నిపుణుల అంచనా.
image:pixabay
ప్రస్తుతం ఆఫ్రికా దేశాల్లో జనాభా వృద్ధి గణనీయంగా ఉండగా.. యూరప్ దేశాల్లో వృద్ధిరేటు పడిపోతోంది.
image: unsplash
ప్రపంచ జనాభాలో 27 శాతం మంది 25 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కులే ఉన్నారట.
image: unsplash
ప్రపంచ జనాభా 1804లో 100 కోట్లుగా ఉండేది. 1960 నాటికి అది 300 కోట్లకు, 2000 నాటికి 600 కోట్లకు చేరింది.
image:unsplash
గతంతో పోలిస్తే.. జనాభా పెరుగుతున్నా.. ఎక్కువ శాతం ప్రజలు చదువుకుంటూ, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతున్నారని నిపుణులు చెబుతున్నారు.
image:unsplash