ఎమోజీకీ ఓ రోజుంది తెలుసా..
జపాన్‌లో 1990లో షిగెటాకా కురిటా అనే వ్యక్తి ఈ ఎమోజీలను కనిపెట్టాడు. అతను డొకొమో కంపెనీలో మొబైల్ కమ్యునికేషన్ విభాగంలో పని చేస్తున్నప్పుడు.. తక్కువ డాటాతో బొమ్మరూపంలో సమాచారం పంపేందుకు మొదటి సారిగా అక్షరాలతో ఎమోజీని తయారు చేశాడు.
image: unsplash
ఎమోజీకి ఆ పేరు ఎలా వచ్చి ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించారా.. జపనీయుల భాషలో ఫొటోని ‘ఈ’ అనీ, పదాలను ‘మోజీ’ అని అంటారు. దానికి.. ఎమోషన్‌ని కూడా కలిపి ఎమోజీ అనడం మొదలుపెట్టారు.
image: unsplash
డొకొమో సంస్థకి వ్యతిరేకంగా ఇతర మొబైల్ కంపెనీల్లో చాలా మంది ఎమోజీలను తయారు చేయడం మొదలు పెట్టారు. 2011లో యాపిల్ కంపెనీ ఎమోజీలను ఐఫోన్ కీప్యాడ్‌పై యాడ్ చేసింది. నిజానికి అప్పటి నుంచే ఈ ఎమోజీల ట్రెండ్ మొదలైంది.
image:pixabay
మొబైల్ కంపెనీలే.. 2014కు ముందువరకు ఈ ఎమోజీలను తయారు చేసేవట. ఆ తర్వాత చాలా మంది యూజర్లు కూడా ఎమోజీలను క్రియేట్ చేయటం మొదలుపెట్టారు.
image: unsplash
మొట్ట మొదట 176 ఎమోజీలను తయారు చేశారు. టెక్స్ట్ చేసే సమయాన్ని ఆదా చేసేందుకు, యూజర్లు విసుగు చెందకుండా ఉండేందుకు ప్రతి ఏటా కొన్ని వందల కొద్దీ ఎమోజీలను సృష్టిస్తున్నారు.
image: unsplash
న్యూయార్క్‌లోని మోడ్రన్ ఆర్ట్ మ్యూజియంలో షిగెటాకా కురిటా తయారు చేసిన ఒరిజినల్ ఎమోజీలను ప్రదర్శనకు ఉంచారు. క్రమంగా మనుషులు, జంతువులు, జాతీయ జెండాలు, చెట్లు పూలు, ఆహార పదార్థాలు ఇలా అనేక ఎమోజీలను సృష్టిస్తూనే ఉన్నారు.
image: unsplash
ప్రస్తుతం ఇవి ఎన్ని ఉన్నాయో తెలుసా..? దాదాపు 2,700కు పైగా ఎమోజీలు అందుబాటులో ఉన్నాయట.
image: unsplash
ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో 2015లో ఆనంద భాష్పాలతో నవ్వుతూ ఉన్న ముఖాన్ని ‘వర్డ్ ఆఫ్ ద ఇయర్’గా ప్రకటించారు. కారణం ఈ ఎమోజీ వాడకం గణనీయంగా పెరిగిందట. దీన్ని ‘ఫేస్ విత్ టియర్స్ ఆఫ్ జాయ్’ గా పిలుస్తారు.
image: unsplash
ఈ ఎమోజీ డేని సోషల్‌మీడియా క్యాంపైన్‌లు, క్విజ్‌లు, ఎమోజీ థీమ్ ఫుడ్, వివిధ రకాల ఎమోజీలకు అర్థమేంటనే విషయాలపై చర్చలతో సెలబ్రేట్ చేసుకుంటారు.
image:pixabay
ఈ రోజుని తొలిసారి సెలబ్రేట్ చేసుకుంది 2014లో.. కారణం ఏమంటే ఇదే రోజున యాపిల్ ఫోన్లలో ఎమోజీలను అందుబాటులోకి తెచ్చారు. అందుకే ఈ రోజునే ఎమోజీడేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం.
image: pixabay