మాస్టర్‌ని చేసే మైండ్‌ గేమ్‌.. 

చెస్‌ ఆడటం అంటే అంత సులువు కాదు. ఒక పావు తీసి ఇంకో గడిలోకి మార్చాలంటే ఆ తర్వాతి పరిణామాలు కూడా ముందే ఆలోచించగలగాలి. జులై 20న అంతర్జాతీయ చెస్‌ డే. ఈ సందర్భంగా చెస్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..

image: unsplash

యూరప్‌లో 1090లో మొట్ట మొదటి చెస్‌ బోర్డును తయారుచేశారు. లేత గోధుమ రంగు, ముదురు నలుపు రంగుని ఉపయోగించి దీన్ని రూపొందించారు. 

image: unsplash

చెస్‌ డేని 1996 నుంచి సెలబ్రేట్‌ చేసుకోవడం మొదలుపెట్టారు. దీన్ని ఇంటర్నేషనల్‌ చెస్‌ ఫెడరేషన్‌ పారిస్‌లో 1924లోనే ప్రకటించింది. కానీ అమలుకు చాలాకాలం పట్టింది. 

image: unsplash

భారత్‌లో గుప్తుల కాలం నుంచే చదరంగాన్ని ఆడేవారట. ముస్లింలు పర్షియాని గెలిచాక అక్కడ కూడా ఈ ఆట ప్రాచుర్యం పొందింది. ఆ తర్వాత యూరప్‌, రష్యాలో కూడా ఈ ఆటను మొదలుపెట్టారు. అప్పట్లో ఈ ఆటని ‘శత్రంజ్‌’ అని పిలిచేవారు.

image: unsplash

 చదరంగంలో ‘చెక్‌మేట్‌’ని పర్షియన్‌ భాషలో ‘షా మాత్‌’ అంటారు. అక్కడ దాని అర్ధం ఏంటంటే.. రాజు మరణించటం. 

image: unsplash

వరల్డ్‌ చెస్‌ ఛాంపియన్‌గా ఇమ్మాన్యుయేల్‌ లాస్కర్‌ దీర్ఘకాలం కొనసాగారు. 1894 నుంచి 1920 వరకూ అంటే దాదాపు 27 ఏళ్ల పాటు ఆయనే చెస్‌ ఛాంపియన్‌..

image: unsplash

మొదట్లో చెస్‌ ఆడేందుకు ఎలక్ట్రానిక్‌ గడియారాన్ని ఉపయోగించేవారట. 1883లో ఇంగ్లండ్‌లో థామస్‌ విల్సన్‌ అనే వ్యక్తి దీన్ని కనిపెట్టారు. ఈ ఎలక్ట్రానిక్‌ గడియారాన్ని ‘టమ్‌బ్లింగ్‌’ అని పిలిచేవారు.

image: unsplash

అమెరికా, జెర్మనీ, రష్యా, భారత్‌లోని ప్రజలు దాదాపు 70 శాతం మంది ఏదో ఒక సమయంలో చెస్‌ ఆడిన వారేనని ఓ అధ్యయనంలో తేలింది. చెస్‌కి ప్రపంచ వ్యాప్తంగా 700 మిలియన్ల మంది ఫ్యాన్స్‌ ఉన్నారట. 

image: unsplash

మొదట్లో చెస్‌లో 32 పావులు మాత్రమే ఉండేవి. వాటిలో రెండు రాణులను చేర్చటం వల్లనే ఈ ఆటకి ఇంత ప్రాముఖ్యత లభించింది. ప్రస్తుతం 34 చెస్‌ కాయిన్స్‌తో ఆడుతున్నారు.

image: unsplash

బెల్‌గ్రేడ్‌లో 1989లో ఓ చెస్‌ టోర్నమెంట్‌ అత్యధికంగా దాదాపు 20 గంటల 15 నిమిషాలు కొనసాగింది. ఆ తర్వాత కూడా అది ఒక కొలిక్కి రాలేదు. నికోలిక్‌- ఆర్సోవిక్‌ అనే ఈ ఇద్దరి ఆటగాళ్ల మధ్య జరిగిన మ్యాచ్‌ డ్రాగానే ముగిసింది.

image: unsplash

IPL: ఈసారి వీళ్లే టాక్‌ ఆఫ్‌ ది ఆక్షన్‌

IPL వేలం: 2022లో ₹ 551.7 కోట్లు... మరిప్పుడు ఎంత?

IPL వేలం: గతేడాది స్టార్క్‌.. అంతకుముందు ఎవరంటే?

Eenadu.net Home