చాక్లెట్ అందరి ఫేవరేట్‌!

చాక్లెట్‌ను తరచూ తింటూనే ఉంటాం.. మన పుట్టినరోజున ఇతరులకు పంచేవి కూడా అవే. సెలబ్రేషన్స్‌ ఏవైనా వాటిలో చాక్లెట్‌దే పై చేయి. అలాంటి చాక్లెట్‌ డేని ప్రతి ఏడాది జులై 7న జరుపుకుంటాం..

image: unsplash

మనకు తెలిసి చాక్లెట్‌ ఫ్లేవర్స్‌ అంటే దాదాపు పదో, పదిహేనో ఉంటాయి అంతేగా.. కానీ ప్రపంచ వ్యాప్తంగా దీని ఫ్లేవర్స్‌ 500 వరకూ ఉంటాయట. మరి మీరెన్ని రుచి చూసి ఉంటారు?

image: unsplash

పూర్వం కొన్ని దేశాల్లో చాక్లెట్లు అరుదుగా దొరికేవట. అందుకని అప్పట్లో వస్తుమార్పిడి కింద చాక్లెట్స్‌ను ఇచ్చి ఇతర వస్తువులను తీసుకునేవారట.  

image: unsplash

కోకో చెట్ల నుంచి వచ్చే గింజలతో చాక్లెట్స్‌ తయారు చేస్తారు. ఈ చెట్లు దాదాపు 200 ఏళ్లు జీవిస్తాయి. వాటి జీవితకాలంలో 25 ఏళ్లు మాత్రమే కోకో గింజలను ఉత్పత్తి చేస్తాయి.

image:unsplash

అప్పట్లో చాక్లెట్‌ అంటే హాట్‌ చాక్లెట్‌.. అంటే కాఫీ లాగా తీసుకునేవారు. అది చేదుగా ఉండేది. దాన్ని గడ్డకట్టించే విధానాన్ని చాలా ఏళ్ల తర్వాత కనుగొన్నారు. ఈ బార్‌లో కోకోబటర్‌, పంచదార, చాక్లెట్‌ లిక్విడ్‌ని ఉపయోగిస్తారు. 

image:unsplash

క్యాడ్‌బెరీ చాక్లెట్‌ కంపెనీ 1842లో మొదటిసారిగా చాక్లెట్‌బార్‌ని తయారు చేసింది. కోకో బీన్స్‌ను వేయించాలని కూడా అప్పుడే కనుగొన్నారు.. ఎందుకంటే గింజల్లో హానికారక క్రిములు ఉంటాయి.. వేడి చేసినప్పుడే అవి చాక్లెట్‌ తయారీకి అనువుగా ఉంటాయి.

image:unsplash

మొదట్లో డార్క్‌ చాక్లెట్లు మాత్రమే దొరికేవి. 1875లో స్విట్జర్లాండ్‌లో మిల్క్‌ చాక్లెట్‌ని కనుగొన్నారు. డేనియల్‌ పీటర్‌ అనే వ్యక్తి దాదాపు ఎనిమిదేళ్లు కష్టపడితే ఇప్పుడు మనం మిల్క్‌ చాక్లెట్‌ని ఆస్వాదించగలుగుతున్నాం.

image:unsplash

ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే చాక్లెట్‌లో 70 శాతం వాటా ఆఫ్రికా దేశాలదే. అక్కడి వాతావరణం కోకో చెట్ల పెంపకానికి అనువుగా ఉంటుంది. దీంతో ఈ పంటను అక్కడ ఎక్కువగా సాగు చేస్తున్నారు. 

image:rkc

చాక్లెట్‌లో కొన్ని విషతుల్యమైన పదార్థాలు ఉంటాయట. అవి మనుషుల జీర్ణవ్యవస్థకు ఎటువంటి ఇబ్బంది లేకుండా జీర్ణం అవుతాయట. అదే జంతువుల జీర్ణవ్యవస్థకి అంత శక్తి ఉండదట. కాబట్టి పెంపుడు జంతువులకి చాక్లెట్స్‌ను తినిపించకూడదు.

image: unsplash

చాక్లెట్‌ వాసన చూసినా తిన్నా.. మనసు, శరీరం రిలాక్స్‌ అవుతాయి. మైగ్రేన్‌ నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతే కాకుండా దీన్ని తగిన మోతాదులో తీసుకుంటే గుండెజబ్బులు కూడా అదుపులో ఉంటాయి.

image:unsplash

చాక్లెట్‌ బార్‌ 93 ఫారెన్‌హిట్ డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కరుగుతుంది. ఇది మనుషులు శరీర ఉష్ణోగ్రతకు దగ్గరగా ఉంటుంది కాబట్టే చాక్లెట్‌ని కొద్ది సేపు మన చేతిలో పట్టుకుంటే అది కరిగిపోతుంది.

image:unsplash

చాక్లెట్‌ని ఎక్కువగా తినే దేశాల్లో స్విట్జర్లాండ్‌ ముందుంటుంది. ఆ దేశంలో ఏడాదికి ఒక్కో వ్యక్తి దాదాపు 5కిలోల చాక్లెట్స్‌ తింటారట. 

image:pixels

ఇటలీలో 2011లో అతిపెద్ద చాక్లెట్‌ బార్‌ను తయారు చేసి రికార్డు సృష్టించారు. దాని బరువు 544 కిలోలు. ఇప్పటివరకు తయారు చేసిన అతిపెద్ద చాక్లెట్‌ బార్‌ ఇదే.

image: pixels

చాక్లెట్‌ను కేవలం తినడానికే కాదు.. సౌందర్య సాధనాల్లోనూ వాడుతుంటారు. చాక్లెట్‌లోని యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ ఏజింగ్‌ గుణాలు చర్మాన్ని ఆరోగ్యంగా, తాజాగా ఉంచుతాయట.

image:rkc

ఒత్తిడిని దూరం చేసే ఆయిల్‌ మసాజ్‌

కోరుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఈ లక్షణాలు ఉండాలి!

ఆకర్షణీయమైన నగరాల్లో టాప్-10 ఇవే!

Eenadu.net Home