టాలీవుడ్‌ చందమామ.. రీఎంట్రీ ఇస్తోందమ్మా..

ఈ ఏడాది ఏప్రిల్‌లో మగ బిడ్డకు జన్మనిచ్చిన నటి కాజల్‌ అగర్వాల్‌ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ విషయాన్నిఆమె స్వయంగా వెల్లడించింది.

image:Instagram/Kajal Agarwal

కమల్‌హాసన్‌, శంకర్‌ క్రేజీ కాంబినేషన్‌లో ‘భారతీయుడు 2’ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇందులో కాజల్‌ నటిస్తోంది. కాగా.. గర్భం దాల్చడంతో నటనకు బ్రేక్‌ ఇచ్చింది.

image:Instagram/Kajal Agarwal

ఈ సినిమా షూటింగ్‌ సెప్టెంబర్‌ 13న తిరిగి ప్రారంభమవుతుందని.. ఈ షెడ్యూల్‌తోనే తాను తిరిగి సెట్స్‌లోకి అడుగు పెట్టనున్నట్లు తెలిపింది.

image:Instagram/Kajal Agarwal 

‘వ్యక్తిగత కారణాల వల్ల ‘భారతీయుడు 2’నుంచి కాజల్‌ పూర్తిగా తప్పుకున్నారు’ అంటూ కొన్నాళ్ల క్రితం వార్తలొచ్చాయి. తాజాగా ఆమె చేసిన ప్రకటనతో వాటన్నింటికి ఫుల్‌స్టాప్‌ పడింది.

image:Instagram/Kajal Agarwal 

తన అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పించిన ఈ స్టార్‌ హీరోయిన్‌ తెలుగు ఇండస్ట్రీలో దాదాపు అగ్ర కథానాయకులందరితో సినిమాలు చేసింది.

image:Instagram/Kajal Agarwal  

జూ.ఎన్టీఆర్‌ హీరోగా వచ్చిన ‘జనతా గ్యారేజ్‌’లో ‘పక్కా లోకల్‌’ అనే ప్రత్యేక గీతంలోనూ ఆడిపాడింది. image:Instagram/Kajal Agarwal

ఆమె వ్యక్తిగత విషయానికొస్తే.. తన చిన్ననాటి స్నేహితుడు, వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లూని ప్రేమించి పెళ్లాడింది.

image:Instagram/Kajal Agarwal 

ఫిట్‌నెస్‌కు ఎక్కువ ప్రాధాన్యమిచ్చే కాజల్‌.. గర్భిణిగా ఉన్నప్పుడూ వర్కౌట్స్‌ చేసింది. ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మహిళలకు అవగాహన కల్పించింది.

image:Instagram/Kajal Agarwal 

తమిళంలో ఆమె నటించిన మూడు సినిమాలు చిత్రీకరణ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమవుతున్నాయి.

image:Instagram/Kajal Agarwal

 దక్షిణాదిన ఆమెకున్న క్రేజ్‌కు రీఎంట్రీలోనూ బోలెడు ఆఫర్లు క్యూ కట్టే ఛాన్స్‌ ఉంది.

image:Instagram/Kajal Agarwal

‘హలో వరల్డ్‌’ అంటూ వచ్చిన సదా..!

డిప్రెషన్‌ గురించి.. దీపికా పదుకొణె ఏమందో తెలుసా?

అదితి శంకర్‌.. డబుల్‌ ధమాకా!

Eenadu.net Home