కమల్‌.. ప్రయోగాత్మక లుక్స్‌

ప్రయోగాత్మక లుక్స్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచే కమల్‌ హాసన్‌ ‘కల్కి 2898 ఏడీ’లో ఇలా కనిపించనున్నారు. ఇందులో ఆయన సుప్రీం యాస్కిన్‌ అనే నెగెటివ్‌ ఛాయలున్న పాత్ర పోషించారు. సినిమా గురువారం విడుదల కానున్న సందర్భంగా ఆయన గతంలో ట్రై చేసిన విభిన్న గెటప్స్‌ చూసేద్దాం..

ఒకే సినిమాలో పది విభిన్న రోల్స్‌ ప్లే చేయడం రికార్డు. ‘దశావతారం’లో విష్ణు భక్తుడు నంబి, వృద్ధురాలు, అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్‌ బుష్‌.. ఇలా ప్రతి పాత్రతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు.

‘భామనే సత్యభామనే’లో.. కొన్ని సన్నివేశాల్లో భామగా నటించి, మంచి వినోదం పంచారు. 

‘విచిత్ర సోదరులు’లో మూడు పాత్రలు (తండ్రి, ఇద్దరు కవలలు) పోషించారు. అందులో ఒకటి ఈ మరుగుజ్జు పాత్ర. పొట్టిగా కనిపించేందుకు కమల్‌ పడిన కష్టం అంతా ఇంతా కాదు!

‘అభయ్‌’లో ట్విన్స్‌గా ద్విపాత్రాభినయం చేశారు. ఒకటి మేజర్‌ రోల్‌కాగా మరొకటి ఈ మానసిక వికలాంగుడి క్యారెక్టర్‌.

‘ఇంద్రుడు చంద్రుడు’లోనూ డ్యుయల్‌ రోల్‌ ప్లే చేశారు. అందులో ఒకటిది. పొట్ట, ఎత్తుదంతాలతో మేయర్‌ పాత్ర పోషించారు.

‘సత్యమే శివం’లోని లుక్‌ ఇది. ముఖంపై శస్త్రచికిత్స కుట్లతోపాటు మీసం కొంచెం కట్‌ అయినట్టు కనిపించేందుకూ ఈ నటుడు వెనకాడలేదు.

విశ్వరూపం 1 & 2లో కమల్‌ కథక్ నృత్య శిక్షకుడిగా.. ‘రా’ ఏజెంట్‌గా కనిపించారు. రెండు పాత్రల మధ్య వైవిధ్యాన్ని చక్కగా చూపించారు.

‘భారతీయుడు’లోని ఈ సేనాపతిని ఎవరూ మర్చిపోలేరు. ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ప్రోస్తటిక్‌ మేకప్‌ను తొలిసారి ఈ సినిమా కోసమే వినియోగించారు.

‘భారతీయుడు 2’లోని గెటప్స్‌ ఇవి. ఈ సినిమా జులై 12న విడుదల కానుంది.

కమల్‌ ప్రస్తుతం నటిస్తున్న చిత్రమిది (థగ్‌లైఫ్‌). గ్యాంగ్‌స్టర్‌ రంగరాయ శక్తివేల్‌ నాయకర్‌ పాత్ర పోషిస్తున్నారు. 

బ్యూటీల ఫిట్‌నెస్‌ మంత్ర

దక్షిణాది చిత్రసీమపై కన్నేసిన అనసూయ

గోల్డెన్‌ బ్యూటీ.. జాన్వీ

Eenadu.net Home