మరోసారి వార్తల్లో ‘సోలోగామీ’ కనిష్కా సోనీ!

తనను తానే పెళ్లి చేసుకొని వార్తల్లో నిలిచిన కనిష్కా సోనీ.. మరోసారి చర్చనీయాంశంగా మారింది. తను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఫొటోలు చూసి.. కనిష్కా తల్లైనట్టు వార్తలొచ్చాయి.

Image: Kanishka Soni

This browser does not support the video element.

తాజాగా వాటిపై స్పందించిన ఆమె.. కాస్త ఎక్కువగా తినడం వల్ల లావయ్యాను. నన్ను నేను పెళ్లి చేసుకుంటే తల్లినెలా అవుతానంటూ వార్తలను ఖండించింది. దీంతో సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలకు తెరపడింది.

Image: Kanishka Soni

తన సోలోగామీ గురించి కనిష్కా.. ఆగస్టు 6న ఇన్‌స్టాలో పంచుకుంది. నుదుట సింధూరం.. మంగళసూత్రం ధరించి ఉన్న ఫొటోను షేర్‌ చేసింది. 

Image: Kanishka Soni

1987 ఆగస్టు 16న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జన్మించింది కనిష్కా సోని. కేంద్రీయ విద్యాలయంలో చదువుకుంది. ముంబయి విశ్వవిద్యాలయం నుంచి ఫైనాన్స్‌ డిప్లొమాలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసింది. 

Image: Kanishka Soni

2007లో ‘బాత్రూమ్‌ సింగర్‌’ రియాలిటీ షోలో పాల్గొంది. గాయనిగా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత ముంబయిలో మోడలింగ్‌ చేసింది. 

Image: Kanishka Soni

This browser does not support the video element.

డీడీ నేషనల్‌ షో క్లోజ్‌ ఆఫ్‌ మ్యూజిక్‌ మస్తీ ఔర్‌ ధూమ్ లో విజేతగా నిలిచిన ఈ భామ.. దేవోన్‌ కే దేవ్‌.. మహాదేవ్‌ (తెలుగులో హర హర మహాదేవ్‌) ధారావాహికలో రేవతి పాత్ర పోషించింది. ‘దియా ఔర్‌ బాతీ హమ్‌’తో పాపులారిటీ సంపాదించుకుంది. 

Image: Kanishka Soni


దాదాపు 35కుపైగా సీరియల్స్‌లో నటించిన కనిష్కా.. తెలుగులోనూ పలు ప్రకటనల్లో మెరిసింది. నటిగా, గాయనిగా, మోడల్‌గా తనకంటూ ప్రత్యేకత చాటుకుంది. 

Image: Kanishka Soni

ఇవే కాకుండా రెస్క్యూ ఫౌండేషన్‌తో అనుబంధం ఉంది. సామాజిక కార్యకలాపాల్లోనూ మంచి గుర్తింపు సాధించింది. దీంతో మంచి నటనతో పాటు సేవా దృక్పథం ఉన్న వ్యక్తిగా పేరొందింది. 

Image: Kanishka Soni


2013లో తమిళంలో ‘ఫథాయెరప్‌ కోడి’లో వివేక్‌ సరసన నటించి సినిమాల్లోకి తెరంగేట్రం చేసింది. 

Image: Kanishka Soni

This browser does not support the video element.

ఎంఏ పాస్‌ సినిమాలో ప్లే బ్యాక్‌ సింగర్‌గా బ్రేక్‌ తెచ్చుకుంది కనిష్కా. అంతేకాదు ‘కాసో మ్యూజిక్‌’ పేరుతో సొంత కంపెనీని ప్రారంభించింది. దీంతో ఎంతో మంది సింగర్లు బాలీవుడ్లో తమ ప్రతిభ చూపించుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. 

Image: Kanishka Soni

This browser does not support the video element.

ఈ నటి యోగా ట్రైనర్‌ కూడా. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ ఉంటుంది. 

Image: Kanishka Soni

దేవర వీక్‌.. ఈ బ్యూటీలదే!

లవ్లీ.. లెహంగాస్‌!

జాన్వీ.. చుట్టమల్లే చుట్టేస్తాందే!

Eenadu.net Home