మహేష్‌తో యాడ్‌.. విశ్వక్‌తో సినిమా..

విశ్వక్‌సేన్‌ లేడీ గెటప్‌లో కనిపించనున్న తాజా చిత్రం ‘లైలా’. ఇందులో కథానాయికగా కన్నడ భామ ఆకాంక్ష శర్మ నటిస్తోంది. ఇదే ఆమె తొలి టాలీవుడ్ చిత్రం.

రామ్‌ నారాయణ్‌ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని ప్రేమికుల రోజు కానుకగా.. ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. 

అంతకుముందు శాండల్‌వుడ్‌లో ఆకాంక్ష ‘కాలింగ్‌’, ‘ఆఫ్టర్‌ ద థర్డ్‌ బెల్‌’ వంటి చిత్రాల్లో నటించింది. ‘త్రివిక్రమ’తోనే క్రేజ్‌ సంపాదించింది.

ఈ బ్యూటీ.. హీరోయిన్‌గా తెరపై కనిపించడమే కాదు.. తెరవెనుక మెగాఫోన్‌ కూడా పట్టుకుంది! ‘రోడ్‌ బ్లాక్‌డ్‌ ఎహెడ్‌’ అనే చిత్రానికి ఈమె దర్శకత్వం వహించింది.

 కొన్నాళ్లు మోడలింగ్‌ చేసింది. పలు బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. వివిధ మ్యాగజీన్‌ కవర్‌ల కోసం ఫొటోలకు పోజులిచ్చి ఆకట్టుకుంది.

This browser does not support the video element.

 ప్రైవేట్‌ వీడియో ఆల్బమ్స్‌లోనూ ఆడి పాడింది. మహేష్‌బాబుతో కలసి ఓ ప్రకటనలోనూ నటించింది.

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ ఫొటోలు, వీడియోలను పంచుకుంటుంది. ఇన్‌స్టాలో ఈమెను 9 లక్షలకుపైగా నెటిజన్లు ఫాలో అవుతున్నారు.

ఈ బ్యూటీకి ట్రావెలింగ్‌, షాపింగ్‌ అంటే ఇష్టం. తరచూ విహారయాత్రలకు వెళుతూ అక్కడ దొరికే ప్రత్యేకమైన ఉత్పత్తులను కొనుగోలు చేస్తుంటుంది.

This browser does not support the video element.

ఈమెకి డ్యాన్స్‌ చేయడం చాలా ఇష్టం. ‘నన్ను సంతోషంగా ఉంచేది అదే.. ఖాళీ సమయం దొరికితే చాలు డ్యాన్స్‌ చేస్తూనే ఉంటాను. ఇంత ఫిట్‌గా ఉండేందుకు కూడా కారణం అదే...’ అంటోందీ బ్యూటీ.

ఎన్ని ఉన్నా.. జిలేబీ, చేపలకూర ఉండాల్సిందే!

త్రిప్తి వస్తే.. కుర్రకారుకు ఉక్కపోతే!

బ్యూటీల ఫిట్‌నెస్‌ మంత్ర

Eenadu.net Home