ఫాస్ట్ బీటు.. రీష్మా ఫిట్‌నెస్ రూటు
ఉపేంద్ర ‘యూఐ’తో డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది కన్నడ భామ రీష్మా ననయ.
2002లో బెంగళూరులో పుట్టిన రీష్మా బ్యాచ్‌లర్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్‌లో డిగ్రీ పూర్తి చేసింది.
నటన మీద ఉన్న ఆసక్తితో సినిమాలు ఎక్కువగా చూసేది. ‘ఆ హీరోయిన్ స్థానంలో నేను ఉంటే ఎలా ఉంటుంది’ అని ఊహించుకునేదట.
‘ద లివాన్ బెంగళూర్ టైమ్స్ ఫ్రెష్ ఫేస్’ బ్యూటీ కాంటెస్ట్‌లో పాల్గొని రన్నరప్‌గా నిలిచింది. ఆ తర్వాత ప్రకటనల్లో అవకాశాలు వచ్చాయి.
2022లో ‘ఏక్ లవ్ యా’తో కన్నడ తెరపై హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అదే ఏడాది ‘రాణా’లో నటించింది.
‘బానదరియల్లి’తో పాటు ‘స్పూకీ కాలేజ్’లో ప్రత్యేక పాటలో అలరించింది. ప్రస్తుతం ‘KD ద డెవిల్’, ‘అణ్ణ ఫ్రమ్ మెక్సికో’లో నటిస్తోంది.
దూర ప్రాంతాలకు విహార యాత్రలకు వెళ్లడం అంటే ఇష్టం. దుబాయ్ ఫేవరెట్ స్పాట్.
‘బై బ్లడ్ ఎవ్వరూ కనెక్ట్ అవ్వరు మనం నడుచుకునే విధానం బట్టే అందరూ మనతో మెలుగుతారు’ అని నమ్ముతుంది రీష్మా.
ఖాళీ సమయాల్లో స్విమ్మింగ్ చేస్తుంది. స్కూబా డైవింగ్ చేయడం నచ్చుతుంది.
బైక్ డ్రైవింగ్ ఇష్టం. రాత్రి వేళల్లో రయ్ రయ్ అంటూ రోడ్లపై చక్కర్లు కొడుతుంది.
శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకునేందుకు ఎక్కువగా శ్రమిస్తుంది. రోప్ ఎక్సర్‌సైజ్‌తో పాటు ఫాస్ట్ బీట్‌లకు డ్యాన్స్ చేస్తుంది.