నేటితరం.. ‘కపూర్‌’ తారలు!

జాన్వీ కపూర్‌

శ్రీదేవి-బోనీ కపూర్‌ పెద్ద కుమార్తె. ‘ధడక్‌’లో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చి.. స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. త్వరలో ‘ఎన్టీఆర్‌ 30’తో టాలీవుడ్‌కు పరిచయం కానుంది.

Image: Instagram

సోనమ్‌ కపూర్‌

బాలీవుడ్‌ నటుడు.. అనిల్‌ కపూర్‌ వారసురాలిగా ‘సావరియా’తో వెండితెరపైకొచ్చింది. 2018లో ఆనంద్‌ అహుజాని వివాహం చేసుకుంది. కొన్ని నెలల కిందట మగబిడ్డకు జన్మనిచ్చింది. 

Image: Instagram

వాణీ కపూర్‌

దిల్లీకి చెందిన ఈ భామ.. ‘శుద్ధ్‌ దేశీ రొమాన్స్‌’తో బాలీవుడ్‌ హీరోయిన్‌గా మారింది. నాని తెలుగు-తమిళ్‌ ద్విభాషా చిత్రం ‘ఆహా కల్యాణం’లో నటించింది.

Image: Instagram

శ్రద్ధా కపూర్‌

బాలీవుడ్‌ నటుడు శక్తి కపూర్‌ కుమార్తె. ‘తీన్‌ పట్టీ’తో తెరంగేట్రం చేసి.. స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. ‘సాహో’లో ప్రభాస్‌కి జోడీగా మెరిసింది. 

Image: Instagram

ఆకాంక్ష రంజన్‌ కపూర్‌

నటుడు, దర్శకుడు శశి రంజన్‌ కుమార్తె. ‘గిల్టీ’, ‘మోనికా.. ఓ మై డార్లింగ్‌’ వంటి ఓటీటీ చిత్రాల్లో నటించి పాపులారిటీ పొందింది. మ్యూజిక్‌ ఆల్బమ్స్‌లోనూ నటించింది. 

Image: Instagram

శనయా కపూర్‌

బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ కపూర్‌ వారసురాలు. తెరంగేట్రం చేయకముందే బీటౌన్‌లో స్టారడమ్‌ తెచ్చుకుంది. త్వరలో ‘బేదాదక్‌’తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. 

Image: Instagram

ఖుషి కపూర్‌

శ్రీదేవి - బోనీ కపూర్‌ రెండో కుమార్తెనే ఖుషి కపూర్‌. అక్క జాన్వీలాగే నటననే కెరీర్‌గా ఎంచుకుంది. ప్రస్తుతం ‘ది ఆర్చిస్‌’ అనే సినిమాలో నటిస్తోంది.

Image: Instagram

అన్షులా కపూర్‌

బోనీ కపూర్‌ తొలి భార్య కుమార్తె.. అర్జున్‌ కపూర్‌ సోదరి. ఈమె సినిమాల్లో నటించట్లేదు గానీ.. సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయన్సర్‌గా పాపులారిటీ ఉంది.

Image: Instagram

ఈ వారం ఓటీటీ సినిమాలు/సిరీస్‌లు

ఈ హీరోయిన్ల ‘టాటూ’ అర్థం తెలుసా?

స్ట్రాప్‌లెస్‌ ట్రెండ్‌ గురించి విన్నారా!

Eenadu.net Home