బెబో.. వయసు పెరిగినా వన్నె తగ్గని అందం 

వయసు పెరుగుతున్నా వన్నె తరగని అందంతో సినిమాల్లో రాణిస్తోంది బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్‌. 

Source:Instagram/Kareena Kapoor

‘లాల్‌సింగ్‌ చడ్ఢా’తో మరోసారి అభిమానుల ముందుకు రానుంది ఈ అందాల తార. ఆమిర్‌ ఖాన్‌, నాగచైతన్య కలిసి నటించిన ఈ చిత్రం ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Source:Instagram/Kareena Kapoor

 బాలీవుడ్‌లో కరీనా కపూర్‌ అడుగుపెట్టి 22 ఏళ్లు అయింది. కపూర్‌ కుటుంబం నుంచి ఈ బ్యూటీ 2000 సంవత్సరంలో ‘రెఫ్యూజీ’ చిత్రంతో తెరంగేట్రం చేసింది.

Source:Instagram/Kareena Kapoor

తొలి సినిమాతోనే ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అందుకుంది. ఆ తర్వాత ఎన్నో బాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌ చిత్రాల్లో నటించి అగ్ర కథానాయికగా మారింది.

Source:Instagram/Kareena Kapoor 

2012లో సైఫ్‌ అలీ ఖాన్‌- కరీనా కపూర్‌ల వివాహం జరిగింది. వీరికి ఇద్దరు (తైమూర్‌ అలీఖాన్‌ పటౌడీ, జహంగీర్‌ అలీఖాన్‌ పటౌడీ) కుమారులు ఉన్నారు.

Source:Instagram/Kareena Kapoor

సైఫ్‌, కరీనా ‘తషాన్‌’ సినిమా సెట్‌లో ప్రేమలోపడ్డారట. ఆ తర్వాత నాలుగేళ్లకు పెళ్లి పీటలెక్కారు.

Source:Instagram/Kareena Kapoor

రెండు ప్రెగ్నెన్సీలలో తనకెదురైన అనుభవాల్ని రంగరించి.. ‘ప్రెగ్నెన్సీ బైబిల్‌’పేరుతో పుస్తకం రాసింది బెబో. ఆన్‌లైన్‌లో ఈ పుస్తకం కాపీలు హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి.

Source:Instagram/Kareena Kapoor

‘తషాన్’ సినిమా సమయంలో సైజ్ జీరోకి తగ్గి.. అమ్మాయిలందరికీ కొత్త ఫిట్‌నెస్ ట్రెండ్‌ని పరిచయం చేసింది కరీనా.

Source:Instagram/Kareena Kapoor  

తన ఫిట్‌నెస్‌కి కారణం యోగానే అంటుంది. రోజూ సూర్యనమస్కారాలు, 45 నిమిషాల పాటు ఇతర యోగాసనాలు చేస్తుందట.

Source:Instagram/Kareena Kapoor 

ఈమె సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్. ఇన్‌స్టాలో 9.4 మిలియన్ల ఫాలోవర్స్‌ ఉన్నారు.

Source:Instagram/Kareena Kapoor

రిద్ది.. ప్రభాస్‌తో అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా!

కృతి సనన్.. గ్లామర్‌ అదిరెన్‌..!

బిహారీ భామ.. ఐశ్వర్యా సుస్మిత

Eenadu.net Home