నేషనల్‌ ప్లేయర్‌.. ‘లైఫ్‌’ కోసం సినిమాలకొచ్చి...

బాలీవుడ్‌ నటి కశికా కపూర్‌ ‘లైఫ్‌’తో టాలీవుడ్‌ లైఫ్‌ స్టార్ట్‌ చేయడానికి రెడీ అయింది. పవన్‌ కేతరాజు దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. 

కషిక 2002లో ముంబయిలో పుట్టింది. సంప్రదాయ నృత్యం కథక్‌లో శిక్షణ తీసుకుంది. 

జాతీయ స్థాయిలో స్విమ్మింగ్, త్రోబాల్‌, బాస్కెట్‌ బాల్‌ పోటీల్లో పాల్గొంది. యాక్టింగ్‌పై ఆసక్తితో తొలుత మోడలింగ్‌ వైపు అడుగులు వేసింది.

ముంబయిలోని గోల్డ్‌బర్గ్‌ స్టూడియోలో యాక్టింగ్‌ కోర్సు చేసింది. 15 ఏళ్ల వయసు నుంచే తల్లితో కలసి ఆడిషన్స్‌కి వెళ్లేది. 17 ఏళ్లప్పుడు ప్రకటనల్లో నటించడం మొదలు పెట్టింది. 

‘ఆయుష్మతి గీత మెట్రిక్‌ పాస్‌’తో త్వరలో బాలీవుడ్‌లో పరిచయం కానుంది. 

కశిక తెలుగులో ‘ట్రూలవ్‌’తోనే ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. దాని కంటే ముందే ‘లైఫ్‌’ విడుదల కానుంది.

2022లో ‘ద వైబ్‌ హంటర్స్‌’ అనే హిందీ సిరీస్‌తో అలరించింది. ‘భాషతో తేడా లేకుండా.. ఏ చిత్ర పరిశ్రమ అయినా కెరీర్‌లో ముందుకు సాగడమే నా లక్ష్యం’ అంటోంది కశిక.

ఇన్‌స్టాలో ఈమె క్రేజ్‌ అంతా ఇంతా కాదు. క్యూట్‌ ఫొటోలతో సందడి చేస్తుంటుంది. ఇన్‌స్టాలో ఈమెను 18.3 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. 

కశికకు విదేశీ పర్యటనలంటే ఇష్టం. తరచూ విహార యాత్రలకు వెళ్తుంది. ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటుంది.

ఈ వారం ఓటీటీ చిత్రాలివే!

వయసు పెరిగినా.. జోరు తగ్గని నాయికలు వీరే!

మిడిల్‌ క్లాస్ మిస్‌ ఇండియా.. మానస

Eenadu.net Home