చూడరో ‘కశ్మీరా పరదేశీ’ కథ!
నాగశౌర్య హీరోగా వచ్చిన ‘నర్తనశాల’ (2018)తో వెండితెరకు పరిచయమైన కశ్మీరా పరదేశీ.. చాలా రోజుల తర్వాత మరో టాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది.
Image:Instagram
బన్నీ వాసు నిర్మిస్తున్న ‘వినరో భాగ్యము విష్ణుకథ’లో కిరణ్ అబ్బవరానికి జోడీగా కనిపించనుందీ భామ.
Image:Instagram
గ్రామీణ నేపథ్యంలో సాగే వినోదాత్మక యాక్షన్ చిత్రమిది. ఈ సినిమాతో మురళీకిషోర్ అబ్బురూ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
Image:Instagram
ఈ సినిమా ఫిబ్రవరి 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన పాటలు, ట్రైలర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి.
Image:Instagram
కశ్మీరా పరదేశీ నవంబర్ 03, 1997న పుణెలో జన్మించింది. అదే నగరంలోని బ్రిహన్ మహారాష్ట్ర కామర్స్ కాలేజ్‌లో డిగ్రీ పూర్తి చేసింది. ముంబయిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ఫ్యాషన్ డిజైన్ కోర్సు కూడా అభ్యసించింది.
Image:Instagram
సినీ రంగంలోకి రాకముందు అనేక వాణిజ్య ప్రకటనల్లో నటించింది. ‘నర్తనశాల’ బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించకపోయినా ఈ భామకు ఇతర భాష చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి.
Image:Instagram
అలా వచ్చిన తొలి బాలీవుడ్ అవకాశమే ‘మిషన్ మంగళ్’ (2019). ఈ హిందీ చిత్రంలో విద్యాబలన్, సంజయ్ కపూర్‌ల కుమార్తెగా నటించి గుర్తింపు తెచ్చుకుంది.
Image:Instagram
అదే ఏడాది ‘రామ్‌పాట్’తో మరాఠీ, ‘శివప్పు మంజల్ పచ్చై’తో తమిళ చిత్రసీమల్లోకి అడుగుపెట్టింది.
Image:Instagram
గతేడాది నిఖిల్ గౌడ హీరోగా వచ్చిన ‘రైడర్’తో కన్నడ ప్రేక్షకులను కూడా పలకరించిందీ బ్యూటీ.
Image:Instagram
కశ్మీరా నటించిన ‘వసంత కోకిల’ తాజాగా విడుదలైంది. మరో రెండు తమిళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
Image:Instagram
ఈ అందాల తారకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. పుస్తకాలు చదవడం, రాయడం, డ్యాన్సింగ్ హాబీస్. తెలుగులో మహేశ్ బాబు, అల్లు అర్జున్, హిందీలో ఫర్హాన్ అక్తర్ అభిమాన నటులు.
Image:Instagram
ఈ భామ సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 1.4 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.
Image:Instagram