సొగసుల సుందరి.. అందాల మల్లీశ్వరి..!

బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్లలో కత్రినా కైఫ్‌ ఒకరు.

Source:Instagram/Katrina Kaif

కెరీర్‌ ఆరంభంలో ఈమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. అసలు నటనే రాదన్న విమర్శలూ వచ్చాయి.

Source:Instagram/Katrina Kaif

 

వీటన్నింటిని ఎదుర్కొని ఇప్పుడు బీ టౌన్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది కత్రినా.

Source:Instagram/Katrina Kaif

ఇప్పుడు దక్షిణాది హీరోకి జోడీగా నటిస్తోంది.‘మెరీ క్రిస్మస్‌’లో విజయ్‌ సేతుపతితో తెర పంచుకుంటోంది. Source:Instagram/Katrina Kaif

ఈ బ్యూటీ ‘బూమ్‌’ అనే చిత్రంతో వెండితెరకు పరిచయమైంది.

Source:Instagram/Katrina Kaif

ఆమె నటించిన ‘మల్లీశ్వరి’ చిత్రం తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇందులో క్యాట్‌.. వెంకటేశ్‌కు జోడీగా నటించింది.

Source:Instagram/Katrina Kaif

తర్వాత ఈ ముద్దుగుమ్మకు వరుస ఆఫర్‌లు వచ్చాయి. 2005లో వచ్చిన ‘అల్లరి పిడుగు’లో బాలకృష్ణ సరసన నటించింది.

Source:Instagram/Katrina Kaif

అనంతరం బాలీవుడ్‌లో బిజీ కావడంతో మళ్లీ టాలీవుడ్‌ వైపు చూడలేదు కత్రినా.

Source:Instagram/Katrina Kaif

సల్మాన్‌ ఖాన్‌, కత్రినా కైఫ్‌ జోడీగా వచ్చిన ‘మైనే ప్యార్‌ క్యు కియా?’ చిత్రం సూపర్‌ హిట్‌ అయింది.

Source:Instagram/Katrina Kaif

 ‘నమస్తే లండన్‌’, ‘వెల్‌ కమ్‌’, ‘సింగ్‌ ఈజ్‌ కింగ్‌’, ‘తీస్ మార్‌ ఖాన్‌’లో అక్షయ్‌ కుమార్‌ సరసన నటించింది. Source:Instagram/Katrina Kaif

బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్‌, కత్రినా కొన్నాళ్లు ప్రేమించుకుని గతేడాది డిసెంబరులో వివాహబంధంతో ఒక్కటయ్యారు.

Source:Instagram/Katrina Kaif

తీస్‌ మార్‌ ఖాన్‌లో ‘షీలా కీ జవానీ..’’ అంటూ అలరించింది. ఈ పాట అప్పట్లో ఒక ఊపు ఊపేసింది. Source:Instagram/Katrina Kaif

కత్రినా కైఫ్‌కి సోషల్‌ మీడియాలో మంచి ఫాలోయింగ్‌ ఉంది. ఇన్‌స్టాలో 65.9 మిలియన్ల ఫాలోవర్స్‌ ఉన్నారు.

Source:Instagram/Katrina Kaif

రిద్ది.. ప్రభాస్‌తో అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా!

కృతి సనన్.. గ్లామర్‌ అదిరెన్‌..!

బిహారీ భామ.. ఐశ్వర్యా సుస్మిత

Eenadu.net Home