‘వల్లంకి పిట్ట’.. హీరోయిన్‌గా వచ్చేసిందిట్టా!

గతంలో బాలనటిగా అలరించిన చాలా మంది ఇప్పుడు హీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. ఆ జాబితాలో కావ్య కల్యాణ్‌రామ్‌ కూడా చేరింది.

image:instagram/kavya_kalyanram

This browser does not support the video element.

గంగోత్రి సినిమాలో వల్లంకి పిట్ట.. వల్లంకి పిట్ట అంటూ ఆడిపాడిన చైల్డ్‌ ఆర్టిస్ట్ కావ్య.. ఇప్పుడు ‘మసూద’తో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది.

image:instagram/kavya_kalyanram

హార్రర్‌, థ్రిల్లర్‌ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమా తాజాగా విడుదలై ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది.

image:instagram/kavya_kalyanram 

This browser does not support the video element.

కావ్య.. 1998 జులై 20న జన్మించింది. న్యాయశాస్త్రంలో పట్టా తీసుకుంది.

image:instagram/kavya_kalyanram 

దర్శకుడు రాఘవేంద్రరావు తన కళ్లు చూసి ‘గంగోత్రి’కి ఎంపిక చేశారని ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. బాలనటిగా 16 సినిమాలకుపైగా నటించింది. 

image:instagram/kavya_kalyanram

This browser does not support the video element.

‘గంగోత్రి’లో హీరోయిన్‌ చిన్నప్పటి పాత్ర పోషించిన కావ్య.. ‘ఠాగూర్‌’లో చిరంజీవి, ‘బాలు’లో పవన్‌ కల్యాణ్‌ లాంటి అగ్రహీరోలతో కలిసి నటించింది.

image:instagram/kavya_kalyanram

This browser does not support the video element.

వారాహి క్రియేషన్‌ నిర్మిస్తోన్న ‘ఉస్తాద్‌’లో కూడా నటించినట్లు తెలిపింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందట. 

image:instagram/kavya_kalyanram

‘మళ్లీ సినిమాల్లో చేస్తానని అనుకోలేదు. అనుకోకుండా ఈ సినిమాకు ఒప్పుకున్నా’నని అంటోంది కావ్య. 

image:instagram/kavya_kalyanram

This browser does not support the video element.

తాను నటించిన ‘గంగోత్రి’ ఎంతో ప్రత్యేకమని.. అందులో చేసిన వల్లంకి పిట్ట.. పాటతోనే ప్రేక్షకులు తనను ఆదరించారని ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది.

image:instagram/kavya_kalyanram

కళ్లతోనే ఆకట్టుకునే ఈ చిన్నది.. కూచిపూడి నాట్యంలోనూ శిక్షణ తీసుకుంది.

image:instagram/kavya_kalyanram

This browser does not support the video element.

ఈమెకు ట్రావెలింగ్‌ అంటే చాలా ఇష్టం. వీలు దొరికినప్పుడల్లా విహారయాత్రలు చేస్తూ.. అక్కడ లభించే ఫుడ్‌ను ఎంజాయ్ చేస్తూ ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. 

image:instagram/kavya_kalyanram

దేవర వీక్‌.. ఈ బ్యూటీలదే!

లవ్లీ.. లెహంగాస్‌!

జాన్వీ.. చుట్టమల్లే చుట్టేస్తాందే!

Eenadu.net Home