బీచ్‌ బ్యూటీ.. కావ్య థాపర్‌

‘డబుల్ ఇస్మార్ట్‌’లో రామ్‌తో కలసి అలరించేందుకు సిద్ధమైంది కావ్య థాపర్‌. ఆగస్టు 15న ఈ సినిమా విడుదల కానుంది.

రామ్‌తో కలసి కావ్య చేసిన డ్యాన్స్‌కి ఫ్యాన్స్‌ ఫిదా అవ్వడమే కాకుండా ‘మాస్‌ జాతరే..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

2013లో ‘తత్కాల్‌’ అనే షార్ట్‌ ఫిల్మ్‌తో పరిచయమైన కావ్య.. అక్కడికి ఐదేళ్ల తర్వాత తెలుగు సినిమా ‘ఈ మాయ పేరేమిటో’తో కథానాయికగా మారింది.  

ఆ తర్వాత‘మార్కెట్ రాజా ఎంబీబీఎస్‌’, ‘ఏక్‌ మినీ కథ’, ‘మిడిల్ క్లాస్‌ లవ్’, ‘పిచ్చైకరన్‌ 2’, ‘ఈగల్‌’, ‘ఊరు పేరు భైరవ కోన’ తదితర చిత్రాలు చేసింది.

వరుస సినిమాలు చేస్తున్నా ఇప్పటికీ సరైన విజయం దక్కలేదు. ఇప్పుడు ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ పైనే ఆశలు పెట్టుకుందీ బ్యూటీ.

వెబ్‌సిరీస్‌ల్లో ఈమె తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ‘కాలీ పీలీ టేల్స్‌’, ‘క్యాట్‌’, ‘ఫర్జీ’ సిరీసుల్లో నటించి మెప్పించింది.

This browser does not support the video element.

కావ్యకు బీచ్‌లో ఆడుకోవడం మహా సరదా. ‘పని ఒత్తిడి, కోపం, బాధ బీచ్‌లో ఆడుకుంటే ఇట్టే మాయమవుతాయి’ అంటోందీమె.

This browser does not support the video element.

సోషల్‌ మీడియాలో కావ్య పిక్స్‌కి, వీడియోస్‌కి కుర్రోళ్లు లైకుల మీద లైకులు కొడుతుంటారు. ఇన్‌స్టా ఖాతా ఫాలోవర్ల సంఖ్య 13 లక్షలకు పైమాటే. 

ఫ్యాషన్‌తో ట్రెండ్‌ సృష్టించే ఆమె విభిన్నమైన దుస్తులతో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూ ఉంటుంది.

This browser does not support the video element.

‘ఒంటరిగా ఉన్నప్పుడే మన సామర్థ్యం ఏంటో మనకు తెలుస్తుంది. ఒకసారి సెల్ఫ్‌ డేట్‌ చేసి చూడండి. ఎంత సంతోషంగా ఉంటుందో.. రీఫ్రెష్‌ అవ్వడానికి ఇదే మంచి మార్గం’ అంటోందీ బ్యూటీ

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home