ఇస్మార్ట్‌ బ్యూటీ.. ముచ్చట్లు!

రామ్‌-పూరి జగన్నాథ్‌ కాంబోలో తెరకెక్కిన ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ ఆగస్టు 15న విడుదలవుతోంది. ఇందులో హీరోయిన్‌.. కావ్య థాపర్‌ డబుల్‌ గ్లామర్‌తో ఆకట్టుకోనుంది. 

సక్సెస్‌ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తోన్న కావ్య.. ఈ చిత్రంపైనే ఆశలు పెట్టుకుంది. ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ గురించి.. తన గురించి పలు సందర్భాల్లో ఆమె చెప్పిన కబుర్లు ఇవీ..  

‘‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమా ఆడిషన్స్‌లో పాల్గొన్నా. కానీ అప్పుడు అవకాశం రాలేదు. ఈ సినిమా విషయం తెలిసి మళ్లీ దర్శకుడు పూరి జగన్నాథ్, నిర్మాత ఛార్మిని కలిసి ఆడిషన్‌ ఇచ్చా. ఈసారి అవకాశం దక్కింది’’

‘‘ఆరంభంలో నేను ఎంచుకున్న పాత్రలు నా నటనలోని ఒకొక్క కోణాన్ని చూపించాయి. ‘ఈగల్‌’ సినిమాలో ఒకలా, ‘ఊరు పేరు భైరవకోన’లో మరొకలా కనిపిస్తా. ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ సినిమాకి వచ్చేసరికి నా నటనలో భిన్న కోణాలు కనిపిస్తాయి’’

‘‘రామ్‌తో కలిసి పనిచేయడం గౌరవంగా, ‘మార్‌ ముంత చోడ్‌ చింత’, ‘స్టెప్పా మార్‌’ పాటల్లో డ్యాన్స్‌ చేయడం వరంగా భావిస్తున్నా. రామ్‌ ఓ అద్భుతమైన వ్యక్తి’’

‘‘నేను ఇప్పటి వరకు వైవిధ్యమైన పాత్రల్లో నటించా. తొలిసారి ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ కోసం ఫైట్స్‌ చేశాను. పాటల్లోనూ ఫుల్‌ జోష్‌తో డ్యాన్స్‌ చేయడం సవాలుగా అనిపించింది’’

‘‘నాకు యాక్షన్‌ ప్రధానమైన పాత్రలంటే ఇష్టమే. కొద్దివరకు ఆ కోరిక ఈ సినిమాతో నెరవేరింది. సాహసోపేతమైన కథలు చూడటమన్నా, ఆ తరహా పాత్రలన్నా నాకెంతో ఇష్టం. త్వరలోనే ఆ తరహా కథల్లో భాగం అవుతాననే నమ్మకం ఉంది’’

‘‘ముంబయి నుంచి వచ్చిన అమ్మాయినైనా, తెలుగింటి ఆడపిల్లలా నన్ను ఆదరిస్తున్నారు. టాలీవుడ్‌లో మంచి మంచి అవకాశాలు లభిస్తున్నాయి. అందుకు, నాకెంతో సంతోషంగా ఉంది’’

‘‘తెలుగు చిత్రసీమలో చిరంజీవి, ఎన్టీఆర్‌ల డ్యాన్స్‌ని చాలా ఇష్టపడతా. నాని, ప్రభాస్‌, రామ్‌చరణ్‌ల నటనని ఎంతో ఇష్టపడతా. వాళ్లతో కలిసి నటించాలనుంది’’

ప్రస్తుతం ఈ ఇస్మార్ట్‌ బ్యూటీ.. గోపీచంద్‌ - శ్రీనువైట్ల కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘విశ్వం’లో నటిస్తోంది. ఈ చిత్రం కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

నిమ్రత్‌ @ 8.. రూమర్స్‌తో ట్రెండింగ్‌లోకి!

ఇండియాలో టాప్‌- 10 ‘గూగుల్డ్‌’ షోస్‌

సెలెనా గోమెజ్‌... పెళ్లి వార్తతో వైరల్‌

Eenadu.net Home