బరువు సంగతి.. జిమ్‌లో చూసుకుందాంలే!

తెలుగులో శ్రీవిష్ణు సరసన ‘అల్లూరి’తో అలరించింది కయ్యదు లోహర్‌. త్వరలో ‘డ్రాగన్‌’లో ‘పల్లవి’గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

అశ్వత్‌ మరిముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రదీప్‌ రంగనాథన్‌ హీరో. అనుపమ పరమేశ్వరన్‌ మరో నాయిక.

2021లో ‘ముగిల్‌పెటె’తో కన్నడ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. మలయాళంలో ‘పాతోన్‌పాతమ్‌ నూట్టండు’, ‘ఒరు జాతి జాతకం’, మరాఠీలో ‘ఐ ప్రేమ్‌ యూ’తో అలరించింది. 

2000లో అస్సాంలో పుట్టింది. పుణెలో పెరిగిన కయ్యదు స్థానికంగా బీకామ్‌లో డిగ్రీ పూర్తి చేసింది.  

నటనలోకి వచ్చే ముందు అందాల పోటీల్లో పాల్గొంది. ‘పుణె ఫ్రెష్‌ టైమ్‌’ కిరీటాన్ని అందుకుంది. ఆ ఫొటోలే కన్నడ సీమ పిలుపునందించాయి.

జువెలరీ అందాల పోటీల్లో పాల్గొన్న తర్వాత.. ఎవర్‌ యూత్‌ ఫ్రెష్‌ ఫేస్‌ సీజన్‌ 12లో టైటిల్‌ను గెలుచుకుంది.  

కయ్యదు అల్లరి ఎక్కువగా చేస్తుంది. కాలేజీలో తనకో పెద్ద గ్యాంగ్‌ ఉండేది. క్లాసులకు డుమ్మా కొట్టి సినిమాలకు వెళ్లిన సందర్భాలు ఎన్నో అని చెప్పింది. 

నాని, అల్లు అర్జున్‌, ఆలియా భట్‌ నటన అంటే ఇష్టం. ‘గంగూబాయ్‌ కాఠియావాడి’ బాగా నచ్చిన చిత్రం.

అవకాశం వస్తే ప్రముఖ దర్శకులు మణిరత్నం, సుకుమార్‌తో కలసి పనిచేయాలనుందని చెప్పింది.

ఖాళీ దొరికినప్పుడల్లా బైక్‌ రైడింగ్‌ చేస్తుంది. ‘అదో సరదా..’ అంటూ ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంది.   

క్రికెట్‌ మ్యాచ్‌లు చూడటం ఇష్టం. ఐపీఎల్‌ సీజన్‌ సమయంలో గ్రౌండ్‌లో సందడి చేస్తూ కేకేఆర్‌ టీమ్‌కు సపోర్ట్‌ చేస్తుంది.

కయ్యదు ఆహార ప్రియురాలు. ఏ ప్రాంతానికి వెళితే అక్కడి ప్రత్యేక వంటకాలను రుచి చూడాల్సిందే.. బరువు సంగతి జిమ్‌లో చూసుకుందాంలే అంటుంది.

రెస్టరంట్లు, పురాతన ఆలయాలు, నదులు, బీచ్‌లు, అడవులు ఈమె ఫేవరెట్‌ స్పాట్‌లు.. ప్రతి మదర్స్‌డేకి అమ్మకి స్వయంగా వంట చేసి వడ్డిస్తుంది.  

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home