ఆన్‌లైన్‌లో ఈ వివరాలను గోప్యంగా ఉంచండి..!
చిరునామా: ఆన్‌లైన్‌లో అవసరమైన చోట తప్ప మీ చిరునామాను ఎక్కడా నమోదు చేయకండి. దొంగలు మీపై నిఘా వేసి ఉంటే.. మీరు లేని సమయంలో ఇంట్లో దొంగతనాలు జరగొచ్చు. మీ చిరునామాను ఉపయోగించి మోసాలకు పాల్పడే అవకాశముంది.
image:rkc
ఆధార్ కార్డు: ఆధార్ నంబరును ఎప్పుడూ బయటపెట్టొద్దు. దీన్ని ఆధారంగా చేసుకొని మీ వివరాలతోపాటు బయోమెట్రిక్ సమాచారాన్ని సైబర్ కేటుగాళ్లు తస్కరించే ప్రమాదముంది.
image:rkc
పాన్ కార్డు: ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో పాన్‌కార్డు కీలకమైంది. దీన్ని ఇతరులు దుర్వినియోగం చేసే అవకాశముంది. కొందరు సైబర్ నేరస్థులు ఇతరుల పాన్ కార్డు వివరాలతో క్రెడిట్‌కార్డు తీసుకొని ఖర్చు చేస్తున్నారు.
image:rkc
ఈమెయిల్: మీ మెయిల్ ఐడీని బహిర్గతంగా ఉంచితే.. స్పామ్, స్కామ్ మెయిల్స్ మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేస్తాయి. మీ మెయిల్ హ్యాక్‌కు గురవ్వొచ్చు.
image:rkc
క్రెడిట్/డెబిట్: వీటి నంబర్లు, సీవీవీ, ఓటీపీలు ఎట్టిపరిస్థితుల్లో ఇతరులకు చెప్పకూడదు. లేదంటే మీకు తెలియకుండా వాటిలోని డబ్బును సైబర్ నేరగాళ్లు కాజేస్తారు.
image:rkc
ఫోన్ నంబర్: ఎక్కడపడితే అక్కడ మొబైల్ నంబర్‌ను ఇచ్చేస్తుంటాం. దీంతో మోసగాళ్లు మన నంబర్లకు వివిధ రకాలుగా ఫోన్ చేసి డబ్బు గుంజే ప్రయత్నం చేస్తారు.
image:rkc
మెడికల్ రికార్డ్స్: మన వైద్య చరిత్రను తెలియజేసే రికార్డ్స్‌ను కూడా ఎవరికీ చెప్పకూడదు. మన అవసరాలను ఆసరాగా చేసుకొని వైద్యానికి సాయం చేస్తామని మోసగించేవాళ్లుంటారు. అలాంటి వారితో అప్రమత్తంగా ఉండాలి.
image:rkc
జియోగ్రాఫిక్ లొకేషన్: ఇది సైబర్ నేరగాళ్లకు చిక్కితే మీరు ఎక్కడెక్కడికి వెళ్తున్నారో తెలుసుకోగలుతారు. మీపై రెక్కీ నిర్వహించి.. ఎలాంటి చర్యలకైనా పాల్పడొచ్చు.
image:rkc
పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఇతర వ్యక్తిగత వివరాలను ఎవరితోనూ పంచుకోకుండా ఉండటమే మంచిది.
image:rkc