ప్రేమ.. పెళ్లి.. కబుర్లతో ట్రెండింగ్‌లో కీర్తి

ప్రేమ కబుర్లు, పెళ్లి న్యూస్‌తో ఇప్పుడు కీర్తి సురేశ్‌ టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది. ఈ నేపథ్యంలో ఆమె గురించి కొన్ని విషయాలు.

చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీతో 15 ఏళ్లు ప్రేమలో ఉండి డిసెంబరు-12 న పెళ్లి పీటలెక్కబోతుంది కీర్తి.

గోవాలో కుటుంబ సభ్యుల సమక్షంలో డెస్టినేషన్ వెడ్డింగ్‌ చేసుకోనుంది.

తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో నటించిన కీర్తి ‘బేబీ జాన్‌’తో బాలీవుడ్‌లో సందడి చేయనుంది.

తమిళ సినిమా ‘తెరి’కి రీమేక్‌గా ‘బేబీ జాన్‌’ తెరకెక్కుతోంది. ఈ క్రిస్మస్‌కి ఈ సినిమా విడుదల కానుంది.

సినిమాలోని ‘నైన్‌ మటక్కా’ పాటలో కీర్తి, వరుణ్‌ ఆన్‌స్క్రీన్‌ కెమిస్ట్రీ, డ్యాన్స్‌ అదిరిపోయాయి.

నటనతో క్యారెక్టర్‌లో ఒదిగిపోయే కీర్తి ఈ సినిమా కోసం గ్లామర్ డోస్‌ పెంచింది. 

కీర్తికి ఎప్పుడైనా ఒత్తిడి అనిపిస్తే.. కప్పు ఛాయ్‌ తాగి.. లాంగ్‌ డ్రైవ్‌కి వెళ్తుంది.

పెర్ల్‌ అకాడమీలో ఫ్యాషన్ డిజైనింగ్‌ చేసిన కీర్తి, సినిమాల్లోకి రాకపోతే డిజైనర్‌ అయ్యేదాన్ని అని చెప్పింది.

వయొలిన్‌, కీబోర్డులను ప్లే చేయడం, హారర్‌ మూవీస్‌ చూడటం కీర్తి హాబీలు

‘ఎన్ని వెరైటీలు నా ముందున్నా దోశకే నా ఓటు.. ఎన్నైనా లాగించేస్తా’ అని చెప్పింది.

‘కనుసైగలతోనే వలచింది..’ ఈమెనే!

మోడలింగ్‌ కోసం డిగ్రీ వదిలేశా

‘దిల్‌రూబా’తో సందడి చేయనున్న రుక్సార్‌

Eenadu.net Home