సంబరంగా కీర్తి డెస్టినేషన్ వెడ్డింగ్.. ఫొటోలివిగో!
కీర్తి సురేశ్ - ఆంటోనీ తటిల్ వివాహం డిసెంబరు 12న ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.
15 ఏళ్లుగా ప్రేమలో ఉన్న కీర్తి-ఆంటోనీ ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.
గోవాలో కుటుంబ సభ్యుల సమక్షంలో డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగింది.
ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, ఇరువురి స్నేహితులు మాత్రమే హాజరయ్యారు.
స్కూల్లో మొదటిసారి కలుసుకున్న వీరిద్దరూ మంచి స్నేహితులయ్యారు.. ఆపై వేర్వేరు కాలేజీల్లో చేరినా ఎమోషనల్‌గా మరింత దగ్గరయ్యారు.
కెరీర్లలో స్థిరపడేందుకు ఇన్ని రోజులు తమ పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చింది ఈ క్యూట్ కపుల్
అనుబంధంలో ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం చాలా ముఖ్యం అంటుంది కీర్తి.
వెడ్డింగ్ పార్టీలో కీర్తి సురేశ్, ఆంటోనీ కలిసి డ్యాన్స్ అదరగొట్టారు.
ఇటీవల ‘బేబీ జాన్’తో బాలీవుడ్‌కు పరిచయమైన కీర్తి ‘రివాల్వర్ రీటా’, ‘కన్నెవీడి’ చిత్రాల్లో నటిస్తోంది.