కేతిక.. అది దా మ్యాటరు!
నితిన్ ‘రాబిన్ హుడ్’లో ‘అది దా సర్‌ప్రైజ్..’ అనే స్పెషల్ సాంగ్‌తో కుర్రకారును కేరింతలు కొట్టించనుంది కేతిక శర్మ.
‘రాబిన్ హుడ్’కి వెంకీ కుడుముల దర్శకుడు. ఈ చిత్రం డిసెంబరు 25న విడుదల కానుంది.
2021లో ‘రొమాంటిక్’తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది కేతిక. ‘లక్ష్య’, ‘రంగ రంగ వైభవంగా’, ‘బ్రో’తో అలరించింది.
‘బ్రో’ తర్వాత తెరకు దూరంగా ఉన్న కేతిక.. మొదటి సారిగా స్పెషల్ సాంగ్‌తో ఎంట్రీ ఇవ్వనుంది.
1995లో దిల్లీలో పుట్టింది కేతిక. చదువు పూర్తయ్యాక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అవతారమెత్తింది.
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకుంటూ ప్రకటనల ద్వారా మోడలింగ్‌లో అడుగుపెట్టింది.
ఈమెకి బీచ్‌లో ఆడుకోవడం అంటే మహా ఇష్టం. తరచూ బీచ్‌ల్లో తీసుకున్న వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.
విదేశీ పర్యటనలకు ఎక్కువగా వెళుతుంది. ‘చిల్ అవ్వాలి బ్రో.. ఎప్పుడూ ఒకే చోట.. ఒకే పని చేస్తూ ఉంటే బోర్ కొట్టట్లా.. అప్పుడప్పుడూ.. పరిగెత్తండి’ అంటూ పోస్టులు పెడుతుంది.
కేతిక క్రికెట్‌కు వీరాభిమాని. స్టేడియంలో కూర్చొని ఆట చూస్తుంటే.. ఆ కిక్కే వేరంటోంది.
ఖాళీగా ఉంటే పుస్తకాలు చదవడం కేతికకు అలవాటు. షాపింగ్ చేస్తూ, నచ్చిన ఫుడ్‌ని ఆస్వాదిస్తూ ఉంటుంది.