కేంద్ర బడ్జెట్‌ 2024.. కీలక ప్రకటనలు

హౌసింగ్‌ ఫర్‌ మిడిల్‌క్లాస్‌

అర్హులైన మధ్యతరగతి వారికి ఇళ్ల కొనుగోలు, సొంతింటి నిర్మాణానికి ప్రోత్సాహం అందించడానికి హౌసింగ్‌ స్కీమ్‌ను తీసుకొచ్చారు. 

పీఎం ఆవాస్‌ యోజన గ్రామీణ్‌

సొంతింటి నిర్మాణం కోసం అందుబాటులో ఉన్న ఈ పథకంలో ఇప్పటికే 3 కోట్ల ఇళ్ల నిర్మాణం పూర్తి కావాలనే లక్ష్యాన్ని చేరుకుంటుండగా.. వచ్చే ఐదేళ్లలో మరో 2 కోట్ల ఇళ్లను నిర్మించనున్నట్లు ప్రకటించారు. 

క్యాన్సర్‌ వ్యాక్సినేషన్‌

9-18 ఏళ్ల బాలికలు సర్వైకల్‌ క్యాన్సర్‌ బారిన పడకుండా తీసుకునే చర్యల్లో భాగంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని విస్తృతస్థాయిలో చేపట్టనున్నారు. 

పోషణ 2.0

పిల్లలు, గర్భిణులు, పాలిచ్చే తల్లులు పోషకాహార లోపం బారిన పడకుండా చేపట్టిన సక్షం అంగన్వాడీ, పోషణ 2.0 కార్యక్రమాలను మరింత బలోపేతం చేయనున్నారు.

వారికీ ఆయుష్మాన్‌ భారత్‌

ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించేందుకు అమలు చేస్తోన్న ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులకూ వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

డిమాండ్‌ నోటీసు రద్దు

ప్రత్యక్ష పన్నులకు సంబంధించి 2009-10 మధ్య రూ.25 వేల వరకు విలువైన డిమాండ్‌ నోటీసులను ఉపసంహరించుకొన్నారు. 2010-11 నుంచి 2014-15 ఆర్థిక సంవత్సరాల మధ్య రూ.10వేల వరకు చెల్లించాలని జారీ అయిన నోటీసులను రద్దు చేశారు.

పీఎం సూర్యోదయ యోజన

ఈ పథకం ద్వారా కోటి ఇళ్లకు రూఫ్‌టాప్‌ సోలార్‌ వ్యవస్థను ఏర్పాటు చేసి.. 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందజేయనున్నట్లు తెలిపారు. 

రైళ్ల ఆధునికీకరణ

దేశవ్యాప్తంగా రైల్వే వ్యవస్థను మెరుగుపరిచేందుకు, ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు 40 వేల సాధారణ బోగీలను వందే భారత్‌ ప్రమాణాలకు అనుగుణంగా మార్చనున్నట్లు ప్రకటించారు. 

కొత్త ఎయిర్‌పోర్టులు

ఉడాన్‌ పథకం కింద.. ఎయిర్‌పోర్టుల విస్తరణ, కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. 2,3 తరగతి నగరాలకు కొత్త విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నారు. 

లక్‌పతి దీదీ

గతంలో 2 కోట్ల మహిళల్ని లక్షాధికారులను చేయడమే లక్ష్యంగా ‘లక్‌పతి దీదీ’ పథకాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ లక్ష్యాన్ని 3 కోట్లకు పెంచారు.  

డ్రై ప్రమోషన్‌.. కాఫీ బ్యాడ్జింగ్‌.. ఈ ట్రెండ్స్‌ తెలుసా?

మారుతీ సుజుకీ కొత్త స్విఫ్ట్‌ విశేషాలివీ..

ఉద్యోగంలో భవిష్యత్తునిచ్చే టాప్‌ 10 కంపెనీలివీ!

Eenadu.net Home