‘టైగర్‌ నాగేశ్వరరావు’..

వీరే కీలకం

‘టైగర్‌ నాగేశ్వరరావు’ భారీ అంచనాల నడుమ ఈ నెల 20న విడుదలకు సిద్ధమైంది. 1970ల్లో స్టూవర్టుపురంలో పేరు మోసిన గజదొంగ టైగర్‌ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమా కీలక పాత్రధారులెవరో చూసేయండి..

హీరో రవితేజ టైటిల్‌ పాత్ర పోషించారు. ఆయనకు ఇదే తొలి పాన్‌ ఇండియా చిత్రం.

ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది నుపూర్‌ ససన్‌. ఇందులో ఆమె సారా అనే పాత్రతో సందడి చేయనుంది. ఈ బ్యూటీ హీరోయిన్‌ కృతిసనన్‌ సోదరి.

ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయంకాబోతున్న మరో హిందీ నటి గాయత్రీ భరద్వాజ్‌. మణి అనే పాత్ర పోషించింది. 

ఈ నటి పేరు అనుక్రీతి వాస్‌. చెన్నైకు చెందిన ఈమె ఈ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. ఆమె పోషించిన పాత్ర పేరు జయవాణి.

సమాజ సేవకురాలు హేమలత లవణం పాత్రలో రేణూ దేశాయ్‌ నటించారు. ఈ సినిమాతో ఆమె రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.

స్టూవర్టుపురానికి వెన్నెముకలాంటివాడు గజ్జల ప్రసాద్‌. ఈ కీ రోల్‌ని నాజర్‌ ప్లే చేశారు. 

ఇంటెలిజెన్స్‌ బ్యూరో అధికారి రాఘవేంద్ర రాజ్‌పుత్‌గా అనుపమ్‌ ఖేర్‌ కనిపించనున్నారు.

డీఎస్పీ (క్రైమ్‌ బ్రాంచ్‌) విశ్వనాథ్‌ శాస్త్రి పాత్రను మురళీశర్మ పోషించారు.

సీఐ మౌళిగా జిషు సేన్‌గుప్త కనిపించనున్నారు.

యలమందగా హరీశ్‌ పేరడి వైవిధ్యాన్ని ప్రదర్శించనున్నారు.

నలుపు.. అందాల మెరుపులు

ఫస్ట్‌ డే కలెక్షన్స్‌.. టాప్‌-10 చిత్రాలివే!

2024 మోస్ట్‌ పాపులర్‌ స్టార్స్‌

Eenadu.net Home