సీక్రెట్‌ చెప్తానంటోన్న.. ‘వసుమతి’

తన అందంతో నెటిజన్లను ఆకట్టుకొంటున్న కియారా అడ్వాణీ.. ఇన్‌స్టాలో తాజాగా పెట్టిన పోస్టు వార్తల్లో నిలిచింది.

image:instgram/kiaraaliaadvani

‘ఈ రహస్యాన్ని ఇంకా దాచి ఉంచలేను.. డిసెంబరు 2 వరకూ వేచి ఉండండి’ అంటూ తన ఇన్‌స్టాలో పోస్టు పెట్టింది. ఈ పోస్టు తన పెళ్లి గురించే అయి ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. 

image:instgram/kiaraaliaadvani

బాలీవుడ్‌ నటులు సిద్ధార్థ్ మల్హోత్రా , కియారా అడ్వాణీ ప్రేమలో ఉన్నారని, వారిద్దరూ పెళ్లి చేసుకుంటారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

image:instgram/kiaraaliaadvani

This browser does not support the video element.

అయితే, మరికొందరు మాత్రం కియారా నటించిన ఏదైనా సినిమా లేదా వెబ్‌సిరీస్‌ గురించి వెల్లడించే అవకాశముందంటున్నారు.

image:instgram/kiaraaliaadvani

కియారా.. 1991 జులై 31న ముంబయిలో జన్మించింది. ఈమె అసలు పేరు ఆలియా అడ్వాణీ సినిమా కోసం తన పేరుని సల్మాన్‌ ఖాన్ కియారా అడ్వాణీగా మార్చాడట!

image:instgram/kiaraaliaadvani

బాలీవుడ్‌లో 2014లో విడుదలైన‘ఫగ్లీ’తో తెరంగేట్రం చేసిన కియారా.. 2016లో ‘ఎంఎస్‌ ధోని- ది అన్‌టోల్డ్‌ స్టోరీ’తో ప్రేక్షకుల మనసు దోచేసింది. దీంతో ఈ భామకు సినిమావకాశాలు క్యూ కట్టాయి. 

image:instgram/kiaraaliaadvani

తెలుగులో.. ‘భరత్‌ అనే నేను’, ‘వినయ విధేయ రామ’లో కథానాయికగా తెరపై మెరిసింది. ఇప్పటి వరకూ తెలుగు, హిందీ భాషల్లో.. 18 సినిమాలకు పైగా నటించింది.

image:instgram/kiaraaliaadvani

చీరకట్టులో కుందనపు బొమ్మలా కనిపించే ఈ భామ మాడ్రన్‌ దుస్తుల్లో గ్లామరస్‌గా కనిపిస్తుంటుంది. సోషల్‌ మీడియాలో ఆమె పోస్టులకు లైకుల వర్షం కురుస్తుంటుంది. ఇన్‌స్టాలో కియారాకు 25.8 మిలియన్ల ఫాలోవర్లున్నారు. 

image:instgram/kiaraaliaadvani

This browser does not support the video element.

సినిమాల కంటే ముందు ఈ ‘వసుమతి’ పలు వాణిజ్య ప్రకటనల్లోనూ నటించింది. ఇప్పుడు వివిధ సంస్థలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తోంది. 

image:instgram/kiaraaliaadvani

ప్రస్తుతం విక్కీ విశాల్, భూమి పెడ్నేకర్‌తో కియారా కలిసి నటించిన ‘గోవిందా నామ్ మేరా’ విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో పాటు కార్తీక్‌ ఆర్యన్‌తో ‘సత్యప్రేమ్‌ కి కథ’, రామ్‌ చరణ్‌తో ‘ఆర్‌సీ15’లో నటిస్తోంది.

image:instgram/kiaraaliaadvani

సెల్ఫీ బ్యూటీస్‌

ఒంటికి యోగా మంచిదేగా..!

రష్మీ.. అనసూయ బాటలో కొత్త యాంకర్‌..

Eenadu.net Home