చలికాలంలో చిన్నారుల సంరక్షణ!

చలికాలం వచ్చిందంటే జబ్బులను వెంట తీసుకొస్తుంది. కొద్ది రోజులుగా చలి తీవ్రత అధికమైంది. దీంతో చిన్నారులు జబ్బులు, ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశముంది. గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. 

Image:RKC

చలికాలంలో ఎక్కువగా జలుబు, దగ్గు చిన్నారులను ఇబ్బంది పెడతాయి.

Image:RKC

ఊపిరితిత్తుల సమస్య(ఆస్తమా) ఉంటే ఊపిరి తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది.

Image:RKC

తరచుగా జ్వరం వచ్చే అవకాశముంది. వైరల్‌ ఫీవర్‌తో చిన్నారులు సతమతం అవుతుంటారు.

Image:RKC

చెవిలో ఇన్‌ఫెక్షన్‌ సోకొచ్చు. కురుపులతో నొప్పి అధికమవ్వొచ్చు. కొందరికి చీము పట్టే అవకాశం ఉంటుంది.

Image:RKC

కొన్నిసార్లు చలితో ముక్కులోపలి భాగం పొడిబారిపోతుంది. దీంతో తరచుగా రక్తం కారుతుంది.

Image:RKC

చర్మం పగిలి దురద వస్తుంటుంది. గోర్లతో రక్కినపుడు పుండ్లు అయ్యే అవకాశముంది. 

Image:RKC

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

చర్మ సమస్యలు రాకుండా ఉండేందుకు శరీరానికి మాయిశ్చరైజర్‌ క్రీమ్స్‌ రాయాలి.

Image:RKC

రాత్రి, పగలు చిన్నారులకు ఉన్ని దుస్తులను వేయాలి. పాఠశాలకు వెళ్లే వారికి ఉన్నిదుస్తులతో పాటు చేతి గ్లౌజులు కూడా వేయాలి.

Image:RKC

చలికాలంలో రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. అలాంటప్పుడు వైద్యుల సూచన మేరకు మందులు, సిరప్‌లు వాడాలి.

Image:RKC

ఆహారం విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. ఆహారం కలుషితం కాకుండా చేతులు శుభ్రం చేసుకోవాలి. వేడి ఆహారం తినేలా చూడాలి. చల్లని పానీయాలు ఇవ్వొద్దు. 

Image:RKC

పోషకాలు మెండుగా ఉండే ఆహారం తినిపించాలి. అప్పుడే జబ్బులను తట్టుకునే శక్తి లభిస్తుంది.

Image:RKC

చలితో పాటు దుమ్ము, ధూళితో గొంతునొప్పి ఎక్కువగా వేధిస్తుంటుంది. అందుకే, పిల్లలను ఆరుబయట చలిలో ఆడుకోనివ్వొద్దు. 

Image:RKC

అలర్జీలు ఎందుకొస్తాయో తెలుసా?

మజ్జిగ .. మేలేంతో తెలుసా..?

టీబీ: నిర్లక్ష్యం.. అత్యంత ప్రమాదకరం!

Eenadu.net Home