పెళ్లి పీటలెక్కనున్న అతియా శెట్టి

టీమిండియా వైస్ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌.. సునిల్‌ శెట్టి కుమార్తె, నటి అతియా శెట్టిని వివాహం చేసుకోనున్నారు. త్వరలోనే వీళ్లు పెళ్లి పీటలెక్కనున్నట్లు సునీల్‌ శెట్టి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 

image:Instagram/athiyashetty

కామన్‌ ఫ్రెండ్‌ ద్వారా పరిచయమైన రాహుల్‌-అతియా ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. వీళ్లిద్దరూ 2018 నుంచి డేటింగ్‌లో ఉన్నారు. మూడు నెలల్లో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. 

image:Instagram/athiyashetty

తండ్రి బాటలో నడుస్తూ.. 2015లో ‘హీరో’తో సినీరంగ ప్రవేశం చేసింది అతియా. తర్వాత కాస్త బ్రేక్‌ తీసుకొని.. 2017లో ‘ముబారకన్‌’, 2019లో ‘మోతిచూర్ ఛక్నాచూర్‌’లో నటించింది. కానీ, సక్సెస్‌ను అందుకోలేకపోయింది.  

image:Instagram/athiyashetty

ఈ అందాల భామ 1992 నవంబరు 5న ముంబయిలో జన్మించింది. అక్కడే అమెరికన్‌ స్కూల్‌ ఆఫ్‌ బాంబేలో చదువుకుంది. 

image:Instagram/athiyashetty

అదే స్కూల్‌లో బాలీవుడ్‌ నటులు శ్రద్ధాకపూర్‌, టైగర్‌ ష్రాఫ్‌ కూడా చదువుకున్నారట. అతియా వారిద్దరితో కలిసి స్కూల్లో జరిగే నాటకాల్లో పాల్గొనేది.

image:Instagram/athiyashetty

చదువు పూర్తవగానే నటన మీద ఉన్న ఆసక్తితో న్యూయార్క్‌లోని ‘న్యూయార్క్‌ ఫిలిం అకాడమీ’లో శిక్షణ తీసుకుంది. 

image:Instagram/athiyashetty

ఆ తర్వాత పలు సౌందర్య ఉత్పత్తుల ప్రకటనల్లో నటించింది. వివిధ సంస్థలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది.

image:Instagram/athiyashetty

ఎప్పటికప్పుడు తన ఫొటోలను ఇన్‌స్టాలో పోస్టు చేస్తూ ఉంటుంది. అతియాకు ఇన్‌స్టాలో 3.9 మిలియన్ల ఫాలోవర్లున్నారు. యూట్యూబ్‌ ఛానెల్‌ కూడా ఉంది.

image:Instagram/athiyashetty

రాహుల్‌ పుట్టిన రోజు సందర్భంగా 2020లో ఆయనతో కలిసి దిగిన ఫొటోను పోస్టు చేస్తూ ‘నా వ్యక్తి(మై పర్సన్‌)’ అని క్యాప్షన్‌ ఇవ్వడంతో వారి ప్రేమ విషయం బయటపడింది. అప్పట్నుంచి వీరి పెళ్లెప్పుడనే చర్చ జరుగుతూనే ఉంది. 

image:Instagram/athiyashetty

రాహుల్‌-అతియా పెళ్లికి ఇరు కుటుంబసభ్యులు చాలా కాలం కిందటే ఒప్పుకున్నారట. ఎట్టకేలకు వీరి వివాహం 2023 మార్చిలో జరగనున్నట్లు తెలుస్తోంది. 

image:Instagram/athiyashetty

ఈ భామకు ‘టీ’ అంటే ఎంతో ఇష్టమట! తన పెంపుడు కుక్కలతో ఎక్కువ సమయం గడుపుతూ ఉంటుంది. 

image:Instagram/athiyashetty

సెల్ఫీ బ్యూటీస్‌

ఒంటికి యోగా మంచిదేగా..!

రష్మీ.. అనసూయ బాటలో కొత్త యాంకర్‌..

Eenadu.net Home