బంగారం కొనే ముందు వీటి గురించి తెలుసుకోండి!

‘ధన్‌తేరస్‌’ సందర్భంగా చాలా మంది బంగారం కొనేందుకు ఆసక్తి చూపుతుంటారు. అయితే, బంగారం కొనేముందు ఈ విషయాలు తెలుసుకొని జాగ్రత్త వహించడం మంచిది.

Image: RKC

ధర

బంగారం ధర తరచూ మారుతుంటుంది. ఒక్కో చోట ఒక్కోలా ఉంటుంది. కాబట్టి బంగారం కొనే ముందు ఒకట్రెండు షాపుల్లో ధరపై ఆరా తీయాలి.

Image: RKC

స్వచ్ఛత

బంగారం స్వచ్ఛతను క్యారెట్లలో కొలుస్తారు. కాయిన్లు.. కడ్డీల రూపంలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారాన్ని కొనొచ్చు. ఆభరణాలు మాత్రం 22 క్యారెట్ల బంగారంతో ఉంటాయి.

Image: RKC

హాల్‌మార్క్‌

మీరు కొనుగోలు చేసే ఆభరణాలపై బీఐఎస్‌ హాల్‌మార్క్‌ ఉందో లేదో చూడాలి. హాల్‌మార్క్‌ ఆభరణాల స్వచ్ఛతను తెలియజేస్తుంది.

Image: BIS Facbook

ఛార్జీలు

ఆభరణాల మేకింగ్‌, తరుగు అంటూ కొన్న బంగారంపై ఛార్జీలు వసూలు చేస్తారు. ఇవి విక్రయదారుల్ని బట్టి మారుతూ ఉంటాయి. ఎక్కడ తక్కువ ఛార్జీలుంటే అక్కడ కొనొచ్చు.

Image: RKC

కొనుగోలు విధానం

బంగారాన్ని చాలా మంది షోరూమ్‌కి వెళ్లి కొంటారు. అలా కాకుండా, ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయొచ్చు. బ్యాంకులు కూడా వేర్వేరు విలువల్లో 24 క్యారెట్ల బంగారు నాణేలను విక్రయిస్తున్నాయి.

Image: RKC

రాళ్లతో నష్టం

రాళ్లు ఎక్కువగా ఉన్న ఆభరణాలతో నష్టం ఎక్కువే. వాటిని అమ్మాల్సి వచ్చినప్పుడు రాళ్లను వేస్టేజ్‌ కింద తీసేసి మిగతా బంగారాన్ని మాత్రమే లెక్కగడతారు. కాబట్టి.. కొనేటప్పుడు రాళ్లు తక్కువ ఉండే ఆభరణాలు కొనాలి. ఒకవేళ కొన్నా.. రాళ్లకు ఎంత ధర వేస్తున్నారో గమనించాలి.

Image: RKC

డిస్కౌంట్స్‌/స్కీమ్స్‌

పండగల సందర్భంగా కొన్ని షోరూమ్స్‌ డిస్కౌంట్స్‌, స్కీమ్స్‌తో వినియోగదారుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాయి. వాటిలో ఎంత మేర లాభం ఉందో ఒకటికి రెండు సార్లు పరిశీలించి కొనాలి.

Image: RKC

రశీదు

కొనుగోలు చేసిన నగలకు రశీదు తీసుకోవడం మర్చిపోవద్దు. పేపర్‌పై రాసి ఇచ్చిన బిల్లును కాకుండా కంప్యూటర్‌ జనరేటెడ్‌ బిల్లును తీసుకోండి. నాణ్యతలో ఇబ్బందులు ఎదురైతే బిల్లు సాక్ష్యంగా ఉంటుంది.

Image: RKC

మార్కెట్లో మదుపు చేస్తున్నారా? ఇవి తెలుసా..

విజేతలు చెప్పిన సూత్రాలు మీకోసం..

ఎన్టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ ఐపీఓ.. కీ పాయింట్స్‌

Eenadu.net Home