ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసే ముందు ఇవి గమనించండి!
ఫిక్స్‌డ్ డిపాజిట్ అనేది భారత్‌లో సంప్రదాయ పెట్టుబడి మార్గంగా కొనసాగుతోంది. రాబడి తక్కువగా ఉన్నా నష్టభయం ఉండదని చాలా మంది ఎఫ్‌డీకి మొగ్గు చూపుతుంటారు.
Image: Eenadu
ఎఫ్‌డీ చేసే ముందు కొన్ని విషయాలను గమనించాల్సిన అవసరముంది. అవేంటంటే..
Image: Eenadu
కాలపరిమితి
స్వల్ప(1-3 ఏళ్లు), మధ్య(3-5 ఏళ్లు), దీర్ఘ(5-10 ఏళ్లు)కాలం పాటు ఎఫ్‌డీ చేయొచ్చు. కాలపరిమితిని బట్టి వడ్డీ రేటులో మార్పులుంటాయి.
Image: Pixabay
స్వల్పకాలిక ఎఫ్‌డీపై కంటే.. దీర్ఘకాలిక ఎఫ్‌డీపై వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది.
Image: Eenadu
బ్యాంక్ పరపతి
ఎక్కువ వడ్డీ ఇస్తున్నారని అన్ని బ్యాంకుల్లో ఎఫ్‌డీ చేయడం మంచిది కాదు. ప్రముఖ బ్యాంకులు, నమ్మదగిన బ్యాంకుల్లోనే ఎఫ్‌డీ చేయాలి.
Image: Eenadu
క్రిసిల్, కేర్ వంటి సంస్థలు బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలకు రేటింగ్ ఇస్తుంటాయి. క్రిసిల్ ఎఫ్‌ఏఏ+, కేర్ ఏఏ రేటింగ్ ఉన్న సంస్థల్ని ఎంపిక చేసుకోవడం ఉత్తమం.
Image: Eenadu
వడ్డీపై ఆదాయం
ఎఫ్‌డీ చేశాక.. ఆ మొత్తంపై వచ్చే వడ్డీని పొందే విధానం రెండు (క్యుములేటివ్, నాన్-క్యుములేటివ్) రకాలుగా ఉంటుంది.
Image: Eenadu
క్యుములేటివ్‌లో ఎఫ్‌డీ కాలపరిమితి ముగిశాక అసలుకు వడ్డీ మొత్తం కలిపి ఇస్తారు. నాన్-క్యుములేటివ్‌లో నెలనెలా లేదా మూడు/ఆరు/ఏడాదికోసారి వడ్డీని చెల్లిస్తారు.
Image: Eenadu
ఎఫ్‌డీపై రుణం
ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బ్యాంకులు రుణాలు కూడా ఇస్తాయి. ఎఫ్‌డీ మొత్తంలో 75శాతం వరకు సొమ్మును రుణంగా పొందొచ్చు.
Image: Eenadu
మీరు ఎఫ్‌డీ చేయాలనుకుంటున్న బ్యాంక్‌లో ఈ సదుపాయం ఉందో లేదో అడిగి తెలుసుకోండి.
Image: Eenadu