క్రెడిట్‌ కార్డుపై లోన్‌ తీసుకుంటున్నారా?

చాలా బ్యాంకులు క్రెడిట్‌ కార్డులపై టాప్‌-అప్‌ రుణాలు ఇస్తుంటాయి. వీటిని తీసుకునే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి.

Image: Eenadu

క్రెడిట్‌కార్డుపై రుణం పొందాలంటే.. ముందుగా మంచి క్రెడిట్‌ స్కోరు కలిగి ఉండాలి.

Image: Eenadu

ఇప్పటికే మీరు రుణం తీసుకొని ఉంటే ఆ రుణానికి సంబంధించిన నెలవారీ ఈఎంఐ క్రమం తప్పకుండా చెల్లిస్తూ ఉండాలి. అప్పుడే కొత్త రుణం మంజూరవుతుంది.

Image: Eenadu

క్రెడిట్ కార్డు ఆధారంగా రుణం తీసుకుంటే.. ప్రాసెసింగ్ ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రాసెసింగ్ ఛార్జీలు ఒక్కో బ్యాంకులో ఒక్కో విధంగా ఉంటాయి.

Image: Eenadu

క్రెడిట్‌కార్డుపై రుణం చెల్లింపు కాలపరిమితి గరిష్ఠంగా 24 నెలలు ఉంటుంది. కొన్ని బ్యాంకులు మాత్రమే 24 నెలలకు మించి కాలవ్యవధిని అందిస్తున్నాయి.

Image: Pixabay

బ్యాంకులు మీ మొత్తం క్రెడిట్ కార్డు పరిమితిలో దాదాపు 75 శాతం వరకు రుణంగా అందిస్తాయి. మిగిలిన 25 శాతంపై క్రెడిట్ కార్డు వడ్డీ రేట్లు వర్తిస్తాయి.

Image: Eenadu

క్రెడిట్ కార్డు ఆధారంగా తీసుకున్న రుణం మొత్తాన్ని ముందస్తుగా ఎప్పుడైనా చెల్లించొచ్చు. కానీ, బ్యాంకు విధించే ముందస్తు చెల్లింపు ఛార్జీలను భరించాల్సి ఉంటుంది.

Image: Eenadu

తీసుకున్న రుణం సమయానికి చెల్లించకపోతే అది క్రెడిట్‌ స్కోరుపై ప్రభావం చూపుతుంది. భవిష్యత్తులో రుణాల మంజూరులో ఇబ్బందులు ఎదురవుతాయి.

Image: Eenadu

మార్కెట్లో మదుపు చేస్తున్నారా? ఇవి తెలుసా..

విజేతలు చెప్పిన సూత్రాలు మీకోసం..

ఎన్టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ ఐపీఓ.. కీ పాయింట్స్‌

Eenadu.net Home