కోహ్లీ..ది హీరో

అనుష్క శర్మ నాలుగే పదాల్లో విరాట్‌ను అభినందిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీ పోస్టు చేసింది. ‘అద్భుతమైన ఇన్నింగ్స్‌.. అద్భుతమైన వ్యక్తి’ అంటూ తన భర్త ఆటతీరును ప్రశంసించింది.

వీరేంద్ర సెహ్వాగ్

భారత్‌ అద్భుతం చేసింది. ఇదే మార్గంలో కొనసాగాలి. విరాట్ కోహ్లీని ఆపడం ఎవరి తరం కాదు. వన్డేల్లో 13వేల మార్క్‌ను దాటినందుకు కంగ్రాట్స్‌.

వెంకటేశ్‌ ప్రసాద్

 విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ సూపర్ ఇన్నింగ్స్‌లు ఆడారు. వారిద్దరి ఆటను ఇలా చూడటం బాగుంది. మరీ ముఖ్యంగా పాక్‌పై భారీ స్కోరు సాధించడం అభినందనీయం. వైజాగ్‌లో ధోనీ ఇన్నింగ్స్‌ను గుర్తు చేశారు. 

వసీమ్‌ జాఫర్

విరాట్ నుంచి మరో క్లాసిక్‌ ఇన్నింగ్స్‌. మాటల్లో వర్ణించలేం. 

హర్షా భోగ్లే

విరాట్ కోహ్లీ నుంచి వచ్చిన మరో అద్భుతమైన ఇన్నింగ్స్‌ల్లో ఇదొకటి. తప్పకుండా ప్రత్యేకత కలిగి ఉంటుంది. పాకిస్థాన్‌పై మరింత దూకుడుగా ఆడతాడు. 

సచిన్ తెందూల్కర్

కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీకి కంగ్రాట్స్. పాకిస్థాన్‌పై రెండు మ్యాచుల్లో ఆరుగురు బ్యాటర్లు అదరగొట్టారు. 

బీసీసీఐ కార్యదర్శి జైషా

విరాట్ కోహ్లీ తన జీవితంలో అద్భుతమైన మైలురాయిని చేరుకున్నాడు. వన్డేల్లో 13 వేల పరుగులు చేశాడు. ఆటపట్ల చూపే దృక్పథం, నిబద్ధత అనిర్వచనీయం. అసలైన క్రికెట్ దిగ్గజంగా నిలిచావు. 

షోయబ్‌ అక్తర్

మరోసారి విరాట్ కోహ్లీ తన అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించాడు. అతడి కెరీర్‌లో ఇదొక అద్భుతమైన ఇన్నింగ్స్‌ అనడంలో సందేహం లేదు. 

IPL: ఈసారి వీళ్లే టాక్‌ ఆఫ్‌ ది ఆక్షన్‌

IPL వేలం: 2022లో ₹ 551.7 కోట్లు... మరిప్పుడు ఎంత?

IPL వేలం: గతేడాది స్టార్క్‌.. అంతకుముందు ఎవరంటే?

Eenadu.net Home