విరాట్‌ కోహ్లీ @ 15 ఏళ్లు

టీమ్‌ఇండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌ కెరియర్‌లో 15 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. రన్ మెషిన్‌గా పేరొందిన కోహ్లీ ఎన్నో రికార్డులు నమోదు చేశాడు. వాటిలో టాప్‌ రికార్డులివీ.. (Photos: RKC)

టీ20ల్లో అత్యధిక పరుగులు (4008) సాధించిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు.

వన్డేల్లో అత్యంత వేగంగా(242 మ్యాచ్‌లు) 12వేల పరుగులు సాధించిన ఆటగాడు కోహ్లీనే.

టీ20ల్లో ఎక్కవసార్లు ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు (7) అందుకున్న క్రికెటర్లలో కోహ్లీ తొలిస్థానంలో ఉన్నాడు.

టీ20ల్లో అత్యధిక అర్ధశతకాలు(38) చేసిన రికార్డు కూడా కోహ్లీ పేరు మీదే ఉంది. ఇందులోనూ రెండో స్థానంలో పాక్‌ క్రికెటర్‌ బాబర్‌ అజామే(33) ఉన్నాడు. 

టీ20ల్లో అత్యంత వేగంగా (96 మ్యాచ్‌ల్లో) 3500 పరుగులు సాధించిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. కోహ్లీ తర్వాత గుఫ్తిల్‌(న్యూజిలాండ్‌), రోహిత్‌ శర్మ ఉన్నారు. 

ఒక జట్టు(శ్రీలంక)పై వన్డే మ్యాచ్‌ల్లో అత్యధిక శతకాలు(10) చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీది తొలిస్థానం.

మూడు ఫార్మాట్లు కలిపి అత్యధిక ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డులు(20) అందుకున్నది కూడా కోహ్లీనే. 

ఒక క్యాలెండర్‌ ఇయర్‌(2018)లో మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక శతకాలు(11) నమోదు చేసిన రెండో క్రికెటర్‌ కోహ్లీ. తొలిస్థానంలో సచిన్‌ తెందూల్కర్‌(12/1998) ఉన్నాడు.

సోషల్‌మీడియాలోనూ కోహ్లీదే హవా.. భారత్‌లో అత్యధిక ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్స్‌ (256 మిలియన్‌) ఉన్న సెలబ్రిటీ కోహ్లీనే.

IPL: ఈసారి వీళ్లే టాక్‌ ఆఫ్‌ ది ఆక్షన్‌

IPL వేలం: 2022లో ₹ 551.7 కోట్లు... మరిప్పుడు ఎంత?

IPL వేలం: గతేడాది స్టార్క్‌.. అంతకుముందు ఎవరంటే?

Eenadu.net Home