తెరపై ‘మనమే’ అంటోన్న ఉప్పెన అందం

‘ఉప్పెన’తో ఎంట్రీ ఇచ్చి ఉప్పెన లాంటి తెలుగు అభిమానాన్ని సొంతం చేసుకుంది కృతిశెట్టి. ఈమె ప్రస్తుతం ‘మనమే’తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

శర్వానంద్‌ హీరోగా శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్‌ 7న విడుదల కానుంది. ఈ సినిమాలో ఎక్కువ భాగం విదేశాల్లోనే చిత్రీకరించడం విశేషం.

ఇందులో కృతి సుభద్ర పాత్రలో నటించింది. ఇప్పటివరకు తను చేసిన పాత్రల కంటే ఇది ఎంతో భిన్నంగా ఉంటుందని, తనకే కొత్తగా అనిపించిందని చెప్పింది.

ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఈ బ్యూటీని ‘మీరు సింగిలా? రిలేషన్‌షిప్‌లో ఉన్నారా’అని వ్యాఖ్యాత అడగ్గా.. ‘నా పనితో రిలేషన్‌లో ఉన్నా’అని తెలిపింది. 

కాబోయే భర్త ఎలా ఉండాలని అడిగితే.. అతడు నిజాయతీ, ఇతరులపై దయ కలిగిన వ్యక్తయి ఉండాలని తన మనసులో మాట బయటపెట్టింది.

హీరోల్లో రామ్‌చరణ్‌కు వీరాభిమాని. ఆయనతో నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తా. యాక్షన్‌, మార్షల్‌ ఆర్ట్స్‌ ప్రాధాన్యం ఉన్న పాత్రలు వచ్చినా చేస్తానంటోంది. 

తనకు రాకుమారి పాత్రలంటే చాలా ఇష్టమట. ‘బాహుబలి’లో రాకుమారి అనుష్క లాంటి పాత్రలో నటించాలని ఉందని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

విహారయాత్రలంటే ఇష్టం. అందులోనూ పారిస్‌ నగరానికి వెళ్లడమంటే ఆసక్తి. సంప్రదాయ నృత్యంలో కృతికి ప్రావీణ్యం ఉంది. ఇష్టపడి మరీ శిక్షణ తీసుకుంది. 

This browser does not support the video element.

ఈమె బెల్లీ డ్యాన్స్‌కి ఉండే క్రేజే వేరు. ఇటీవల బెల్లీ డ్యాన్ప్‌ వీడియో ఇన్‌స్టాలో పోస్టు చేసింది. ‘ఇది చూసి తట్టుకోవడం కష్టమే..!’ అంటూ నెటిజెన్లు కామెంట్లు, లైకుల వర్షం కురిపించారు.

అటు మోడ్రన్‌.. ఇటు సంప్రదాయ లుక్స్‌తో ఇన్‌స్టాలో ఫొటోషూట్లు, వీడియోలు షేర్‌ చేస్తుంటుంది. తన ఇన్‌స్టా ఖాతాకి 7.9మిలియన్‌ ఫాలోవర్లున్నారు.

ప్రస్తుతం మలయాళంలో ‘అజయంతే రన్దమ్‌ మోషణమ్‌’, తమిళంలో ‘వా వాతియారే’, ‘లవ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌’, ‘జీనీ’ తదితర చిత్రాలతో బిజీగా ఉంది.

This browser does not support the video element.

బోర్‌ అనిపించినప్పుడల్లా కృతి రీల్స్‌ చేస్తుంటుంది. ఇన్‌స్టాలో వైరల్ అయ్యే పాటలతో ట్రెండ్‌ను ఫాలో అవుతుంది.

ఈ వారం ఓటీటీ సినిమాలు/సిరీస్‌లు

ఈ హీరోయిన్ల ‘టాటూ’ అర్థం తెలుసా?

స్ట్రాప్‌లెస్‌ ట్రెండ్‌ గురించి విన్నారా!

Eenadu.net Home