‘బేబమ్మ’ బర్త్‌డే: టాలీవుడ్‌ క్రేజీ హీరోయిన్‌ కృతి శెట్టి!

‘ఉప్పెన’తో కుర్రకారు గుండెల్లో కల్లోలం రేకెత్తించిన బ్యూటీ కృతి శెట్టి. నేడు ఆమె పుట్టిన రోజు.

Source:Instagram/ Krithi Shetty 

ఉప్పెనలో ‘బేబమ్మ’గా నటించి తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Source:Instagram/ Krithi Shetty 

ఆ తర్వాత కృతి వరుస ఆఫర్‌లు అందుకుంది. అలా ‘శ్యామ్‌ సింగరాయ్‌’, ‘బంగార్రాజు’, ‘ది వారియర్‌’, ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాల్లో నటించింది.

Source:Instagram/ Krithi Shetty 

తాజాగా విడుదలైన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ లోనూ సుధీర్‌బాబుకి జోడిగా నటించింది.

Source:Instagram/ Krithi Shetty 

2003 సెప్టెంబరు 21న ముంబయిలో జన్మించింది కృతి. తండ్రి వ్యాపారవేత్త కాగా.. తల్లి ఫ్యాషన్‌ డిజైనర్‌.

 Source:Instagram/ Krithi Shetty 

స్కూల్‌ డేస్‌లోనే పలు వాణిజ్య ప్రకటనల్లో నటించింది. ‘సూపర్ 30’ అనే హిందీ చిత్రంలో విద్యార్థి పాత్రలో తళుక్కున మెరిసింది.

Source:Instagram/ Krithi Shetty 

కృతికి చికెన్‌ అంటే చాలా ఇష్టం. డ్యాన్స్‌ చేయడం హాబీ.

Source:Instagram/ Krithi Shetty 

‘శ్రీదేవి, సమంత.. నటనలో వీళ్లే నా స్ఫూర్తి’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

Source:Instagram/ Krithi Shetty 

ప్రస్తుతం బాలా దర్శకత్వంలో సూర్యతో కలిసి ఒక సినిమా చేస్తోంది. వెంకట్ ప్రభు డైరెక్షన్‌లో నాగచైతన్యతో మరో చిత్రంలో నటిస్తోంది.

Source:Instagram/ Krithi Shetty 

సోషల్‌ మీడియాలో కృతి శెట్టి ఫుల్‌ యాక్టివ్‌. ఎప్పటికప్పుడు తన ఫొటోలను అభిమానులతో పంచుకుంటుంది.

Source:Instagram/ Krithi Shetty 

ఈమెకు ఇన్‌స్టాలో 3.7 మిలియన్ల ఫాలోవర్స్‌ ఉన్నారు.

Source:Instagram/ Krithi Shetty 

ఈ వారం ఓటీటీలో వీటిదే సందడి

చిరుతో స్టెప్పులేయడం నా అదృష్టం!

‘తెర’ పంచుకున్న హీరోయిన్లు..

Eenadu.net Home